English | Telugu
సిరి టాటూ నిజం కాదు.. శ్రీహాన్ నువ్వు మోసపోవద్దు
Updated : Nov 27, 2022
బిగ్ బాస్ హౌస్ లో టాప్-5 లో శ్రీహాన్ ఉంటాడు అని ప్రతీ ఒక్కరూ చెప్తున్నారు. ఐతే ఇదే బిగ్ బాస్ హౌస్ కి ఐదో సీజన్ లో పార్టిసిపేట్ చేసిన సిరి.. ఫైనల్ వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు శ్రీహాన్ హౌస్ లో చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు. ఇకపోతే రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి సిరి వెళ్లి శ్రీహాన్ తో కలిసి డాన్స్ చేసింది. తన కోసం మెడ మీద వేసుకున్న టాటూని కూడా చూపించింది. శ్రీహాన్ అది చూసి కొంచెం ఎమోషనల్ అయ్యాడు కూడా. ఇప్పుడు వీళ్ళ మీద సోహైల్ వేసిన పంచులు వేరే లెవెల్లో ఉన్నాయి.
ఐతే బిగ్ బాస్ సీజన్ 6 ఎండింగ్ కి దగ్గర పడుతుండేసరికి ఫామిలీ మెంబర్స్ ని గత సీజన్స్ లోని కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి కొంచెం ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేయడానికి మేకర్స్ తంటాలు పడుతున్నారు. అందులో భాగంగానే ఒక్కో కంటెస్టెంట్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, వాళ్లకు బాగా కావాల్సిన వాళ్ళని హౌసులోకి తీసుకొస్తున్నారు.
ఇక ఇప్పుడు వీకెండ్ వచ్చింది కాబట్టి.. హౌస్ మేట్స్ కోసం వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ని ఈ షోకి తీసుకొచ్చారు. అలా శ్రీహాన్ కోసం అతడి తండ్రితో పాటు బిగ్ బాస్ తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ వచ్చాడు. శ్రీహాన్ పై పంచులు కూడా వేశాడు. అయితే ఇనయా కోసం షోకు వచ్చిన బిగ్ బాస్ సోహైల్ శ్రీహాన్ తో మాట్లాడుతూ.. "సిరి టాటూ పర్మినెంట్ కాదు, మోసపోవద్దు" అని ఫన్నీ కామెంట్స్ చేశాడు. "నమ్మొద్దు, నమ్మొద్దు" అనే సాంగ్ ని పాడటానికి ట్రై చేశాడు. కానీ హోస్ట్ నాగార్జున ఆపేసారు.