English | Telugu
`కార్తీకదీపం`లోకి `వంటలక్క` వచ్చేసింది
Updated : Jun 4, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీనియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా విజయవంతంగా సాగుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. జ్వాలని ఎలాగైనా అవమానించాలని ప్లాన్ చేసిన శోభ ప్రత్యేకంగా పార్టీని ఏర్పాటు చేస్తుంది. ఆ పార్టీకి జ్వాల వచ్చిందా?.. అసలు ఏం జరిగింది? .. మధ్యలో `వంటలక్క` హడావిడి ఏంటీ? అన్నది ఇప్పడు చూద్దాం. నిరుపమ్ గురించి ఆలోచిస్తూ జ్వాల ఆనందపడుతూ వుంటుంది. అదే సమయానికి శోభ అక్కడి వచ్చి జ్వాలని పార్టీకి రావాలని పిలుస్తుంది.
ఇది నన్ను అవమానించడానికే పిలుస్తోందని జ్వాల మనసులో అనుకుంటుంది. ఆ తరువాత పార్టీకి నేను రానని చెబుతుంది. తను రాకపోతే ఎలా అని భావించిన శోభ నువ్వు ఎలాగైనా రావాలి అంటూ జ్వాలని బ్రతిమాలుతుంది. అయినా సరే జ్వాల నేను రానంటే రాను అని మొండిగా చెబుతుంది. దీంతో పార్టీకి నిరుపమ్ తో పాటు అంతా వస్తున్నారని చెబుతుంది శోభ. అయినా సరే నేను వాళ్లను బయట కలుస్తాను పార్టీకి మాత్రం రాను అని చెప్పేస్తుంది జ్వాల.
నువ్వు రాకపోతే డాక్టర్ సాబ్ ఫీలవుతాడు. నువ్వు ఎలాగైనా రావాల్సిందే అని చెప్పి వెళ్లిపోతుంది శోభ. డాక్టర్ సాబ్, తింగరి వస్తున్నారా ఏదైతే అది అయింది అని హ్యాపీగా ఫీలవుతుంది. కట్ చేస్తే...త్వరలో స్టార్ మా`లో ప్రసారం కానున్న `వంటలక్క` జోడీ మురళీ (ధీరవీయం రాజ్ కుమారన్), మహిలక్ష్మి (షిరీన్ శ్రీ) తమ సీరియల్ సీరియల్ ప్రమోషన్స్ కోసం ఎంట్రీ ఇచ్చారు. మురళీకి.. సౌందర్య, వరలక్ష్మికి జ్వాల సాయం చేస్తారు. కట్ చేస్తే.. హిమని తలుచుకుని జ్వాల బాధపడుతూ వుంటుంది.
ఆ తరువాత `వంటలక్క` సీరియల్ ప్రమోషన్ సాగింది. కార్తీక దీపం` టీమ్ అంతా `వంటలక్క` సీరియల్ ని చూడండి అంటూ ప్రమోట్ చేశారు. ఇంతకీ శోభ పార్టీ ఇచ్చిందా?.. జ్వాల వెళ్లిందా? వెళితే ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.