English | Telugu
పెళ్లి కాలేదు కానీ నాన్నయ్యాడు..
Updated : Jun 4, 2022
బుల్లి తెరపై టాప్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ తో బుల్లితెరపై కాలు పెట్టి తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా మంచి స్కిట్స్ చేసేవాడు సుధీర్. మొదట్లో మాములుగా హాస్యం కోసం ఈ షో చూసేవాళ్ళు కాస్త ఇప్పుడు సుధీర్ కోసమే చూస్తున్నారు. ఇక ఇప్పడు శ్రీదేవి డ్రామా కంపెనీకి హోస్ట్ గా చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా సంపాదించుకున్నాడు. ఐతే సుధీర్ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇంకా ఎప్పుడు చేసుకుంటావ్ పెళ్లి అంటూ నెటిజన్స్, లేడీ ఫాన్స్ అడుగుతుంటే సమధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఐతే ఇప్పుడు సుధీర్ పెళ్లి కాకుండానే తండ్రయ్యాడు. సుధీర్ కంటే ముందు తన తమ్ముడు రోహన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రోహన్ కూడా అప్పుడప్పుడు స్టేజి మీద కనిపిస్తూ పంచ్ డైలాగ్స్ తో అలరిస్తూ ఉంటాడు.
ఐతే రోహన్ వైఫ్ ఇటీవలే డెలివరీ అయ్యింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు సుడిగాలి సుధీర్ పెళ్లి కాకుండానే పెదనాన్నగా ప్రమోషన్ కొట్టేసాడు. ఇప్పుడు సుధీర్ ఫామిలీ మొత్తం సంబరాలు చేసుకుంటుండగా ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సుధీర్ కి విషెస్ చెప్తున్నారు.