English | Telugu

కృష్ణ మురారి ఇక లేరు.. ఇదేం ట్విస్ట్ రా మామ !


స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అందులోను టీఆర్పీలో మొదటి స్థానంలో బ్రహ్మముడి ఉండగా, మూడవ స్థానంలో కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఉన్నాయి. తాజాగా గుప్పెడంత మనసు సీరియల్ కూడా టాప్ 10 కి చేరుకుంది.

కృష్ణ ముకుంద సీరియల్ ఇప్పుడు కీలక మలుపు తిరగనుందా అంటే అవుననే చెప్పాలి. కథ ప్రారంభంలో.. ముకుంద, మురారి ఇద్దరు విదేశాలలో ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండియాకి వస్తారు. ఇక ఇద్దరికి వేరు వేరు వ్యక్తులతో పెళ్ళిళ్ళు జరుగుతాయి. కృష్ణని మురారి పెళ్ళి చేసుకోగ, ముకుందని ఆదర్శ్ పెళ్ళి చేసుకుంటాడు. అయితే ఆదర్శ్, మురారి ఇద్దరు ఒకే కుటుంబంలో ఉండటంతో అసలు కథ మొదలవుతుంది.

మురారి, ముకుంద. ఇద్దరు ప్రేమిసంచుకున్నారనే విషయం ఆదర్శ్ కి వాళ్ళిద్దరి పెళ్ళి తర్వాత తెలుస్తుంది దాంతో అతను మిలటరీలోకి వెళ్లి ఇక రాకుండా అక్కడే ఉంటాడు. ఇక ముకుంద ప్రేమించిన ప్రేమికుడు మురారి ఒకే ఇంట్లో ఉండటంతో తన మీద ఆశలు పెంచుకుంటుంది. అయితే మురారి పెళ్ళికి ముందున్న తన ప్రేమని మర్చిపోయి, కృష్ణని పెళ్ళి చేసుకొని ప్రేమిస్తుంటాడు. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో.. మురారి తననే ప్రేమిస్తున్నాడని కృష్ణ తెలుసుకుంటుంది. కానీ ముకుంద తన ప్రేమ దక్కించుకోవడానికి మురారి వాళ్ళ పెద్దమ్మ భవానీతో.. మురారిని ప్రేమించిన నిజం చెప్పేస్తుంది.

మురారి, ముకుంద ప్రేమించుకున్న విషయం తెలిసిన భవాని కుప్పకూలిపోతుంది‌. ఇదేం చంఢాలం అని అనుకుంటూ ముకుందని తిడుతుంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో .. కృష్ణ, మురారి ఇద్దరు కార్లో వెళ్తూ మాట్లాడుకుంటారు. " ఎప్పటినుండో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ " అని కృష్ణ చెప్తుంది. అప్పుడే వాళ్ళు వెళ్తున్న కార్ ని ఒక లారీ వచ్చి ఢీకొడుతుంది. దాంతో కృష్ణ, మురారి ఇద్దరు తీవ్రంగా గాయపడతారు. ఆ లారీలో నుండి ఒక అజ్ఞాత వ్యక్తి కిందకి దిగి, పగ తీరింది అన్నట్టుగా ఉంటాడు. మరి ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు, కృష్ణ మురారి చనిపోతారా? బ్రతుకుతారా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి కీలక మలుపుతో ఈ కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది.