'బిగ్ బాస్' హౌస్ నుంచి రాగానే '5జి లవ్' చేయనున్న మానస్!
on Dec 14, 2021

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన మానస్ నాగులపల్లి.. హీరోగా మారి ఆకట్టుకుంటున్నాడు. బిగ్ బాస్ 5 లో అడుగుపెట్టిన మానస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఫైనలిస్ట్స్ లో ఉన్న మానస్ బిగ్ బాస్ 5 టైటిల్ రేసులో ఉన్నాడు. ఇదిలాఉంటే మరోవైపు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తరువాత వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
మానస్ హీరోగా నటించిన 'క్షీర సాగర మథనం' సినిమా ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ఓటిటి వేదిక అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ప్రేక్షకాధరణ పొందింది. ఇప్పుడు మానస్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే.. తాజాగా ఆయన హీరోగా నటించనున్న మూవీ ప్రకటన వచ్చింది. ఆ మూవీ టైటిల్ '5జి లవ్'. మానస్ హౌస్ నుండి బయటకి వచ్చిన వెంటనే ఈ సినిమాలో నటించనున్నాడు.
'స్క్వేర్ ఇండియా స్టూడియోస్ బ్యానర్ పై ప్రతాప్ కోలగట్ల '5జి లవ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ప్రతాప్ '3జి లవ్' అనే యూత్ ఫుల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ ముదునూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



