Read more!

English | Telugu

సుధీర్ మూతిని వాషింగ్ మెషీన్ లా తిప్పుతున్నాడన్న తరుణ్ భాస్కర్

 

సర్కార్ సీజన్ 4 ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కాబోతోంది.. ఈ కొత్త సీజన్ ఎపిసోడ్ 1 ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "ఆట మారలేదు..ఆటగాడు మారాడు" అంటూ హోస్ట్ ప్రదీప్ ప్లేస్ లోకి చాలా రోజుల తర్వాత సుడిగాలి సుధీర్ హోస్ట్ గా రి-ఎంట్రీ ఇచ్చేసాడు. ఇక ఈ షోకి రాహుల్ రామకృష్ణ, తరుణ్ భాస్కర్, సుహాస్, అనన్య నాగళ్ళ  ఇలా ఇంకొంతమంది ఈ షోలో కనిపించారు. ఐతే రాహుల్ రామకృష్ణ సుధీర్ ని బాగా ఆటపట్టించాడు.

ఇంట్రో మళ్ళీ ఒకసారి చెప్పు అనేసరికి సుధీర్ ఉత్సాహంతో "నవ్విస్తారు, నటిస్తారు, జీవిస్తారు" అనేసరికి "ఇంకా చెప్పు గోక్కుంటాడు, గడ్డం పెంచుకుంటాడు" అని జోక్స్ వేసాడు రాహుల్ రామకృష్ణ. ఇక ఇందులో "తెలుగు పాటకు సంబంధించిన ప్రశ్న అని చెప్పి "ఎస్పి బాలు, చిత్ర పాడిన ఒక పాట అంటూ స్వాతిలో ముత్యమంత"  పాట పాడాడు సుధీర్. ఇక తరుణ్ భాస్కర్ సుధీర్ మీద కౌంటర్లు వేసాడు  "ఆయనకు లిరిక్స్ తెలుసు..ఆయన మూతి చూసినప్పుడు వాషింగ్ మెషీన్ లా తిప్పుతున్నాడు " అనేసరికి రాధికా అని పిలిచాడు సుధీర్. "రాధికా ఎవరు" అని తరుణ్ భాస్కర్ అడిగాడు. "మగజాతిని రక్షించడం చాలా ఇబ్బంది అవుతోంది రాధికా ద్వారా. అందుకే ఇక్కడ పెట్టా" అని ఆన్సర్ ఇచ్చాడు సుధీర్. "మరి ఆమెను నీ నుంచి ఎవరు రక్షిస్తారు" అంటూ రాహుల్ రామకృష్ణ అద్దిరిపోయే కౌంటర్ వేసాడు. దానికి సుధీర్ బుంగమూతి పెట్టాడు. ఇక శ్రీగౌరీ ప్రియా, మనసును చూసి తెగ ఓవర్ యాక్షన్ చేసాడు సుధీర్. "నా రెండు మనసులు ఒకే చోట ఉన్నట్టుంది నాకు" అన్నాడు. "ఎన్ని మనసులు ఉన్నాయండి మీకు " అని గౌరీ ప్రియా అడిగింది. "ఈ మనసులో ఒక 30 ఫ్లోర్స్ ఉంటాయి" అనేసరికి " అది మనసా, హోటలా అండి" అని కౌంటర్ ఇచ్చింది గౌరీ ప్రియా.