English | Telugu

పెట్రోలు బంకు దుస్తులలో సుడిగాలి సుధీర్! 


తెలుగు ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న ఏకైక తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా. అందులో భాగంగా విశేష ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్న ‘సర్కార్ సీజన్ 4’కు సంబంధించిన ప్రోమోను విడుద‌ల చేశారు. సీజ‌న్‌4కు సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హరిస్తోండ‌టం విశేషం. ప్రోమో చూస్తుంటే ప్రేక్ష‌కులు ఊహించ‌ని అతిథులు రాక‌తో సంద‌డి చేయ‌బోతున్నారు. అలాగే అదిరిపోయే ట్విస్టుల‌తో ఈ సీజ‌న్ మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉండ‌నుంది.

ఈ సీజ‌న్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హరిస్తోన్న సుడిగాలి సుధీర్ దుస్తులు పెట్రోలు బంకులో ప‌ని చేసేవాళ్లు వేసుకునేలా ఉందంటూ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ విసిరిన పంచ్ న‌వ్వులు పూయిస్తుంది. త‌మ‌దైన కామెడీతో మెప్పించే రాహుల్ రామ‌కృష్ణ‌, జీవ‌న్ కూడా ఈ సీజ‌న్‌లో పాల్గొన్నార‌ని..వారు సుధీర్‌పై స‌ర‌దాగా వేసిన జోకులు, వారి మ‌ధ్య ఉండే స్నేహం వంటి విష‌యాలు ప్రోమోలో చూడొచ్చు.

త‌రుణ్ భాస్క‌ర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, రాగ్ మ‌యూర్‌, జీవ‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, సుహాస్‌, బ‌బుల్ గ‌మ్ ఫేమ్ మాన‌స చౌద‌రి త‌దిత‌రులు ఈ సీజ‌న్‌లో పాల్గొంటున్నారు. ఈ అతిథుల లిస్టు షోకు ఓ ప్ర‌త్యేక‌త‌ను తీసుకొచ్చింది. ప్రోమోను గ‌మ‌నిస్తే షోకు వ‌చ్చిన గెస్టులంద‌రూ స‌ర్కార్ సీజ‌న్ 4కు సంబంధించిన‌ థ్రిల్లింగ్ గేమ్స్‌లో మునిగి తేలార‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. దీనికి సంబంధించిన విష‌యాలు ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకుంటున్నాయి.స‌ర్కార్ ప్రీమియర్ షో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే ఉత్కంఠకు ప్రోమో అద్దం పడుతోంది. మ‌న‌సునిండేలా న‌వ్వుకోవ‌టం, థ్రిల్లింగ్ గేమ్స్‌తో స‌ర్కార్ సీజ‌న్ 4 తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.