English | Telugu

శృతి హాసన్ కోసం కవిత చెప్పిన ధీరజ్...

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాస్ట్ వీక్ ఎపిసోడ్ కి శృతి హాసన్ వచ్చి థమన్ తో కలిసి మంచి మంచి పాటలు పాడి అలాగే కంటెస్టెంట్స్ కి బ్లేసింగ్స్ ఇచ్చి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. ఇక కంటెస్టెంట్ ధీరజ్ ఒక సాంగ్ పాడి ఆ తర్వాత శృతి హాసన్ మీద ఒక కవిత చెప్పాడు. "మీరు పాట పాడితే ఒక సెన్సేషన్, మీరు డాన్స్ వేస్తె అదొక సెలబ్రేషన్, మీకు ఆసక్తికరమైన విషయం ఏదైనా ఉంది అంటే అది మ్యూజికల్ క్రియేషన్, మీ యాక్టింగ్ లో మీరే కమల్ హాసన్, మిమ్మల్ని చూస్తే కరిగిపోతుంది ఆ సన్, ఈరోజు మా అందరితో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ లో మా అందరితో శృతి కలపడానికి వచ్చారు మా శృతి హాసన్" అంటూ చాల భావయుక్తంగా చెప్పాడు. "నాకు నీ కవిత మొత్తం అర్ధమయ్యింది.

థ్యాంక్యూ సో మచ్" అని రిప్లై ఇచ్చింది శృతి. "మీరు చేసిన మొట్ట మొదటి తెలుగు సినిమా అనగనగా ఒక ధీరుడు. అందుకే మీకు ఈ కవితను అంకితం చేస్తున్నాడు ఈ ధీరుడు" అని కూడా చెప్పేసాడు ధీరజ్. ఇక మరో కంటెస్టెంట్ ఐతే శృతి హాసన్ తో ఒక టు స్టెప్స్ వేయాలని కోరేసరికి ఆమె స్టేజి మీదకు వచ్చి డాన్స్ చేసేసింది. అలాగే పవన్ కళ్యాణ్ షర్ట్ మీద హార్ట్ సింబల్ వేసి సైన్ చేసింది. ఇక ఆ కుర్రాడేమో శృతి హాసన్ బొమ్మతో ఉన్న ఒక కలర్ ఫుల్ రెడ్ పిల్లోని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక శృతి డాన్స్ కి థమన్ ఫిదా ఐపోయి..శృతి ఎంత గ్రేస్ తో చేసావో డాన్స్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు.