English | Telugu

అమర్ దీప్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన తేజస్విని!

బిగ్ బాస్ సీజన్-7 లో అమర్ దీప్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే అమర్ దీప్, ప్రియాంక జైన్ కలిసి చేసిన 'జానకి కలగనలేదు' సీరియల్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. దీంతో ఈ ఇద్దరికి బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. అయితే తనపై భారీ అంచనాలు పెట్టుకున్న బిగ్ బాస్ మేకర్స్ కి తీవ్ర అసంతృప్తిని మిగిల్చాడు అమర్ దీప్.

ఇక అమర్‌దీప్ భార్య తేజస్విని గౌడ కూడా బుల్లితెరపై ఎంత ఫేమస్సో తెలిసిందే. బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత అమర్ దీప్ ప్రవర్తన ఎలా ఉంది. ఆటతీరు, మాటతీరు గురించి 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్' అంటూ వ్లాగ్స్ చేస్తుంది తేజస్విని గౌడ. యూట్యూబ్ లోని తన ఛానెల్ లో అమర్ దీప్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది తేజస్విని గౌడ. లెటర్ సాక్రిఫైజ్ గురించి చెప్పండి అని ఒకతను అడుగగా.. సందీప్ మాస్టర్ అమ్మ గురించి ఉంటుందేమోనని అన్నాడు. ఇక ఏమీ ఆలోచించకుండా లెటర్ సాక్రిఫైజ్ చేసేశాడు అమర్. అమ్మ అని అన్న తర్వాత ఇంకా ఏం ఆలోచించలేదు‌. ఇప్పుడిప్పుడు హౌస్ లో ఎవరేంటని తెలుసుకుంటున్నాడని తేజస్విని అంది. లాజికల్ క్వశ్చన్స్ టాస్క్ లో అతనెలా ఆడాడని ఒకరు అడుగగా.. డెఫ్ నెట్లీ బాగా ఆడలేదు. క్వశ్చన్ అడుగగానే బజర్ నొక్కుతున్నాడు. కానీ ఆలోచించట్లేదు. అందరు నవ్వుతున్నారు కానీ నాకనిపించింది ఏంటంటే తన ఆలోచన గేమ్ లో లేదు. ఇంకెక్కడో ఉంది. ఆ లెటర్ లో కూడా నేను రాసాను. మాస్ మహారాజ్ లో ఆ ఫన్ లేదని చెప్పాను. బాగా మోటివేట్ చేశానని తేజస్విని అంది.

హౌస్ లో తన ఆటతీరు సరిగ్గా లేదు కదా అని ఒకరు అడుగగా.. అవును, అందరు అమర్ ని నామినేట్ చేసేసరికి బాగా 'లో' ఫీల్ అవుతున్నాడు. చాలా రోజుల తర్వాత మంచి ప్రోమో చూసాను. అమర్ దీప్ తన వంద శాతం ఇచ్చాడని నాగార్జున అనేసరికి చాలా బాగా అనిపించింది. తనవల్ల‌ కాదు.. ఆడలేడని అందరికి ఒక అభిప్రాయం వచ్చినప్పుడు, పూజామూర్తి తన పక్కన ఉండి.. గెలుపు ఓటమి పక్కన పెట్టి ఆడు అని చెప్పింది. అలా చెప్పగానే అమర్ చిన్నపిల్లాడిలా మారిపోయి.. ఆడాలి, ఆడుతానంటూ ఎమోషనల్ అయ్యాడు. యావర్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే అమర్ కూడా హౌస్ లో అన్నీ అర్థం చేసుకుంటున్నాడని, కచ్చితంగా మళ్ళీ ఆటలో తన సత్తా చాటుతాడని తేజస్విని అంది. అయితే అమర్ దీప్ ఆటలో కసిగా ఆడట్లేదని, ఎప్పుడు చూసిన శివాజీ తనని మెచ్చుకోవాలని చూస్తున్నాడని అభిమానులు అనుకుంటున్నారు. శివాజీ దృష్టిలో తను మంచిగా ఆడుతున్నాడని అనిపించుకోవాలని అమర్ దీప్ అనుకోకుండా, టాస్క్ మీద ఫోకస్ చేస్తే సక్సెస్ అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తేజస్విని గౌడ చేసిన ఈ వ్లాగ్స్ ఇంపాక్ట్ ఉంటుందా లేదా అని చూడాలి మరి.