English | Telugu

పూజామూర్తి ఎలిమినేషన్.. వరుసగా ఏడో ఫీమేల్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ గా మొదలైన విషయం తెలిసిందే. అయితే సీజన్ మొదలైన ఆరు వారాల నుండి వరుసగా ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేటెడ్ అయ్యారు. తాజాగా మరో ఫీమేల్ కంటెస్టెంట్ పూజామూర్తి ఎలిమినేట్ అయింది‌. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి.

సీజన్-7 లో కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతిక, శుభశ్రీ రాయగురు, నయని పావని ఇలా ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఏడవవారం ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేషన్ జరిగింది. ఎందుకంటే పూజామూర్తి కంటే గౌతమ్ కృష్ణ లీస్ట్ ఓటింగ్ లో ఉన్నాడు. దాంతో అందరు ఈ సారి గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అవుతారని అనుకున్నారంతా. కానీ బిగ్ బాస్ ఉల్టా పల్టా చేసి ఈసారి కూడా హౌస్ లో నుండి ఫిమేల్ కంటెస్టెంట్ అయినటువంటి పూజామూర్తిని ఎలిమినేట్ చేశాడు. అయితే నామినేషన్ తర్వాత పూజామూర్తి, అశ్వినిశ్రీల మధ్య జరిగిన గొడవలో పూజామూర్తి బిహేవియర్ నచ్చకనే ప్రేక్షకులు కావాలని ఓటింగ్ చేయకుండా ఎలిమినేషన్ చేయాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

దసరా వేడుకలను బిగ్ బాస్ హౌస్ లో గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా ఈ వారం హౌస్ కెప్టెన్ గా అంబటి అర్జున్ ఎంపిక అయ్యాడు.