English | Telugu
BiggBoss 7 : నీతోటి ఉన్నవాళ్ళని కూడా నమ్మకు.. నీ ఆట నువ్వు ఆడు!
Updated : Nov 10, 2023
బిగ్ బాస్ సీజన్-7 ఫ్యామిలీ వీక్ ఫుల్ సక్సెస్ ఫుల్ అవుతుంది. రోజుకి ముగ్గురు కంటెస్టెంట్స్ చొప్పున వారి ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అటు హౌస్ మేట్స్ లో కాన్ఫిడెన్స్, ఇటు ప్రేక్షకులకి కావల్సిన ఎమోషన్స్ ని ఇప్పిస్తున్నాడు బిగ్ బాస్.
ఫ్యామీలీ వీక్ లో భాగంగా మొదటగా అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ వచ్చింది. అయితే అదే సమయంలో అమర్ దీప్ ని కన్ఫెషన్ రూమ్ కి బిగ్ బాస్ పిలిచి మరీ కేక్ ఇచ్చి బర్త్ డే విషెస్ చెప్పాడు. ఆ తర్వాత తేజస్విని చూసి ఎమోషనల్ అయ్యాడు అమర్ దీప్. బాగా ఆడమని, ధైర్యాన్ని కోల్పోకని తేజస్విని చెప్పింది. " నీ గేమ్ నువ్వు ఆడు. నీతో ఉన్నవాళ్ళని కూడా నువ్వు నమ్మకు" అంటూ అమర్ దీప్ తో తేజస్విని అంది. ఆ తర్వాత కాసేపటికి శోభాశెట్టి వాళ్ళ అమ్మ హౌస్ లోకి వచ్చింది.
" అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి " సినిమాలోని అమ్మ పాటని బిజిఎమ్ గా వేసి మరింత ఆసక్తిగా మలిచారు బిగ్ బాస్ మేకర్స్. తల్లిని చూసిన శోభాశెట్టి తల్లడిల్లిపోయింది. కొన్ని రోజులుగా ఫ్యామిలీని బాగా మిస్సింగ్ అంటు శోభాశెట్టి అంటుంది. ఇప్పుడు కన్నతల్లిని చూడగానే శోభాకి కంటనీరు ఆగలేకపోయాయి. అయితే యావర్ కోసం శోభాశెట్టి వాళ్ళ అమ్మ ఒక బహుమతి తీసుకొచ్చింది. యావర్ తల్లి చనిపోయింది. అందుకే నిన్న గౌతమ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు యావర్ బాగా ఏడ్చేసాడు. ఇప్పుడు కూడా ఎమోషనల్ అయిన యావర్ కి.. కొంగులో దాచిన యావర్ తల్లి ఫోటోని ఇచ్చింది శోభాశెట్టి అమ్మ. ఆ ఫోటోని చూడగానే యావర్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు.
శివాజీ చూసి అమ్మ వచ్చింది యావర్ అనగానే.. మరింత ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత శోభాశెట్టి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడ్డాడు యావర్. నేను కూడా మీ అమ్మనే అంటూ శోభాశెట్టి వాళ్ళ అమ్మ అంది. కాసేపటికి హౌస్ మేట్స్ అంతా యావర్ ని ఓదార్చారు. ఇప్పుడు యావర్ కోసం బిగ్ బాస్ పంపించిన గిఫ్ట్ తో ఈ ఎపిసోడ్ మరింత ఎమోషనల్ గా మారింది. అయితే శోభాశెట్టి వాళ్ళ అమ్మ శోభాకి కొన్ని సలహాలిచ్చింది.