English | Telugu

రైతుబిడ్డని మహర్షి చేసిన బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఆకట్టుకుంటున్నాడు. ఏ టాస్క్ అయిన తన వందశాతం ఎఫర్ట్స్ ని పెట్టి కసిగా ఆడి గెలిచి చూపిస్తున్నాడు. మొదటి వారం నుండి సీరియల్ బ్యాచ్ అంతా కలిసి రైతుబిడ్డని టార్గెట్ చేసిన, శివాజీ తన వెనుకుండి నడిపిస్తున్నాడు.

శివాజీ మాటే వేదంలా, తన గైడెన్స్ లో పల్లవి ప్రశాంత్ హౌస్ లోని అందరిచేత ప్రశంసలు పొందుతున్నాడు. అయితే బిగ్ బాస్ లో ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. మొదట శివాజీ కొడుకు వెంకట్ వచ్చినప్పుడు ఎంత హైప్ వచ్చిందో మళ్ళీ నిన్న జరిగిన ఎపిసోడ్‌లో యావర్ వాళ్ళ అన్నయ్య వచ్చినప్పుడు అంతే హైప్ వచ్చింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రైతుబిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న వచ్చినట్టు తాజాగా విడుదలైన ప్రోమోలో తెలుస్తుంది. ఇందులో మహర్షి సినిమాలోని ' పదర పదర ' అంటూ వచ్చే పాటతో ప్రేక్షకులని రైతులని కలిపేస్తూ ప్రోమోని తీర్చిదిద్దాడు బిగ్ బాస్. ఇక ఈ బిజిఎమ్ కి వాళ్ళ నాన్న హౌస్ లోకి ఎంట్రీ అవ్వడంతో పల్లవి ప్రశాంత్ పరుగున వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు.

అయితే హౌస్ లోకి బిగ్ బాస్ కొన్ని బంతిపూలని పంపించడంతో అవి చూసిన పల్లవి ప్రశాంత్ కంటనీరు తెచ్చుకున్నాడు. కాసేపటికి వచ్చిన వాళ్ళ నాన్నతో ఎన్నో విషయాలని పంచుకున్నాడు పల్లవి ప్రశాంత్. కాగా ఇప్పుడు ఈ ప్రోమోకి అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది. ఈ ప్రోమో కింద.. "కన్నతండ్రిని చూసిన ఆనందంలో రైతుబిడ్డ కంట చినుకు పూల వాన" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.