English | Telugu
తమన్నాకు ఇష్టమైన తెలుగు వంటకాలు!
Updated : Aug 11, 2021
తమన్నా తనను తాను తెలుగమ్మాయిగా ప్రకటించుకుంది. సౌతిండియన్ లాంగ్వేజెస్ అన్నిటిలో సినిమాలు చేసినా ప్రపంచమంతా తనను తెలుగమ్మాయిగా గుర్తిస్తారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తెలుగులో 'మాస్టర్ చెఫ్'కి హోస్ట్‌గా చేస్తోంది. అంతే కాదు... తనకు, తన కుటుంబానికి తెలుగు వంటల్లో ఏవి ఇష్టమో వెల్లడించింది.
"పూత రేకులు, ఆవకాయ... మా ఇంట్లో అందరికీ ఇష్టమైన తెలుగు రుచులు" అని తమన్నా చెప్పింది. తెలుగమ్మాయిగా ప్రకటించుకున్నప్పటికీ... తమన్నా ఇంకా ముంబయిలోనే ఉంటోంది. షూటింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ నుండి ముంబయి వెళుతుంది. వెళుతూ వెళుతూ అక్కడ ఉన్న స్నేహితుల కోసం అప్పుడప్పుడూ హైదరాబాద్ బిర్యానీ తీసుకువెళతానని, వాళ్లకు అది నచ్చుతుందని చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ వంటల గురించి ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నానని తెలిపింది. త్వరలో జెమినీ టీవీలో 'మాస్టర్ చెఫ్' టెలికాస్ట్ కానుంది.
సినిమాల విషయానికి వస్తే ఎప్పుడూ లేనంత బిజీగా మారింది తమన్నా. తెలుగులో 'మేస్ట్రో', 'సీటీమార్' సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా 'ఎఫ్3', 'గుర్తుందిగా శీతాకాలం' ఫిలిమ్స్ సెట్స్ మీద ఉన్నాయి. హిందీలో 'బోలే చుడియా', 'చోర్ నికల్ కే భాగా' చేస్తోంది.