English | Telugu

Brahmamudi: కొంపముంచిన DNA.. భర్తకి భార్య సవాల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -263 లో... స్వప్న తన బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుందని నింద వేసి, తనని ఎలాగైనా ఇంట్లో నుండి బయటకు పంపించాలని రాహుల్ , రుద్రాణి ప్లాన్ చేస్తారు. నాకెవరు అడ్డు చెప్పకండని రుద్రాణి ఇంట్లో వాళ్ళకి చెప్పి స్వప్నని బయటకు గెంటేయ్యబోతుంటే స్వప్న కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో రాజ్ డాక్టర్ కి కాల్ చేసి రమ్మని చెప్తాడు.

ఆ తర్వాత డాక్టర్ వచ్చి స్వప్న ని చెక్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పగానే.. స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ రుద్రాణి మాత్రం ఇది మరొక నాటకమా అని అంటుంది. ఆ తర్వాత డాక్టర్ ని రుద్రాణి అడుగుతుంది.. డాక్టర్ నేను చెప్పేది నిజమని చెప్పగానే.. రాహుల్ కూడా స్వప్న నిజంగానే ప్రెగ్నెంట్. కానీ ఆ బిడ్డకి తండ్రిని మాత్రం నేను కాదని అనగానే అందరూ షాక్ అవుతారు. స్వప్న రాహుల్ అలా అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది. నేను తప్పు చేసాను కానీ తప్పుడు మనిషిని కాదని స్వప్న చెప్తుంది. రుద్రాణి కూడా ఎవరి బిడ్డకు నా కొడుకుని తండ్రిని చెయ్యాలని చూస్తున్నావా అని అంటుంది. నేను అరుణ్ కి డబ్బులు ఇచ్చన మాట నిజమే కానీ నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు. రిచ్ గా బతకాలని అనుకుంటాను. కానీ రిచ్ గా ఉండడానికి తప్పుడు పనులు చేస్తానని అనుకోకండి. ఇది నా వ్యక్తిత్వం, నా క్యారెక్టర్ కీ సంబంధించినదని స్వప్న ధైర్యంగా మాట్లాడుతుంది. మరొకవైపు స్వప్నకి కావ్య సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. నాకు ఈ సమస్యని పరిష్కారించుకునే దైర్యం ఉంది. నువ్వు సైలెంట్ గా ఉండని కావ్యతో స్వప్న అంటుంది. "ఒక ఆడదానివై ఉండి. ఇంత మంది ముందు నా శీలాన్ని అనుమానిస్తావా? నా కడుపులో బిడ్డ నాకూ అండగా ఉంది. ఎంత దూరం అయిన వెళ్తాను. DNA టెస్ట్ చేయిస్తాను. అప్పుడు అందులో నేను తప్పు చేశానని తెలిస్తే నా అంతట నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను" అని ఇంటి పెద్దలకి నిరూపించుకునే అవకాశం ఇవ్వమని స్వప్న కోరుకుంటుంది. ఆ తర్వాత ఆలోచించిన సీతారామయ్య .. ఇలా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు నిజానిజాలు తెలియకుండా నిందలు వెయ్యకండని రాహుల్, రుద్రాణిలకి చెప్తాడు.

మరొకవైపు ఎందుకు ఇలా చేసావ్? స్వప్నని ఇంట్లో నుండి బయటకు పంపించాలని ప్రయత్నం చేస్తుంటే ఒక వైపు తల్లిని చేసావా అంటూ రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది రుద్రాణి. ఆ DNA టెస్ట్ లో రిపోర్ట్స్ మనకి అనుకూలంగా వచ్చేలా మనం చెయ్యాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. తరువాయి భాగంలో.. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదని రాజ్ అంటాడు. నిజం తెలియకుండా నిందలు వెయ్యడం కరెక్ట్ కాదని కావ్య అంటుంది‌. స్వప్న పెళ్లి తర్వాత అరుణ్ తో పరిచయం రహస్యంగా ఉంచడం, అతనితో మాట్లాడటం నేను చూసానని రాజ్ అంటాడు. ఆ నిజాన్ని నేను వెలికి తీస్తాను. అది నింద. నింద మాత్రమే అని బుజువు చేస్తాను. ఇది మా అక్క కోసం మాత్రమే చేస్తున్నా పోరాటం కాదు. ఒక స్త్రీ చాలా సులభంగా పరాయి మగవాడికి లొంగిపోతుందని అనుకుంటున్న మీలాంటి మగవారికి గుణపాఠం నేర్పడానికి కూడా అని రాజ్ కి కావ్య ఛాలెంజ్ విసురుతుంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.