English | Telugu

అశ్వినిశ్రీ ఎలిమినేటెడ్.. ముందే ఫిక్స్ అయిందిగా!

బిగ్ బాస్ సీజన్-7 ఉత్కంఠభరితంగా సాగుతుంది. గడిచిన పన్నెండు వారాలలో ఎవరెలా ఉన్నారంటూ, ఎవరేం చేస్తున్నారో ఇప్పటికే ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చేశారు. ఇక గత వారం నో ఎలిమినేషన్ కావడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పాడు.

ఇదే విషయం గత వారమే క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. అయితే ఆ తర్వాత నామినేషన్ లో ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ చెప్తూ ఇద్దరిని నామినేషన్ చేశారు. కానీ అశ్వినిశ్రీ ఎవరిని నామినేట్ చేయలేదు. తన దగ్గర ఏం రీజన్స్ లేవని, సిల్లీ రీజన్స్ కి నామినేషన్ చేయనని అశ్వినిశ్రీ అనగానే.. సరైన కారణాలతో నామినేట్ చేయకపోతే, ఎవరిని నామినేట్ చేయకపోతే మీరే సెల్ఫ్ నామినేషన్ అవ్వాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. అయినా అశ్వినిశ్రీ ఎవరిని నామినేట్ చేయకపోయేసరికి నామినేషన్ లోకి వచ్చేసింది‌. ఇక వారం మొత్తం జరిగిన టాస్క్ లో తను ప్రూవ్ చేసుకోడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఆ టాస్క్ లో ప్రశాంత్ తర్వాత అశ్వినిశ్రీ డెడ్ అయి తొందరగా టాస్క్ నుండి బయటకొచ్చేసినట్టు అనిపించింది. ఇక నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్‌లో.. అశ్వినిని నాగార్జున లేపి.. కాన్ఫిడెన్సా? లేక ఓవర్ కాన్ఫిడెన్సా అని అడిగాడు. దాంతో తనకేం మాట్లాడాలో అర్థం కాలేదు.

అశ్విని నామినేషన్ చేయకపోవడానికి కారణాలు చెప్పింది‌. ఆ నామినేషన్ రోజున కడుపులో నొప్పి ఉందని, మూడ్ స్వింగ్ లో ఉన్నట్టుగా, తన మూడేం బాలేదని, ఎవరితో వాదించే ఓపిక లేదని సెల్ఫ్ నామినేషన్ తీసుకున్నానని అశ్విని చెప్పింది. అది తప్పు కదా.. వారం మొత్తం హౌస్ మేట్స్ తో ఉన్నావ్? ఒక్కరిలో కూడా తప్పు లేదా నామినేషన్ చేయడానికి అంటు క్లాస్ పీకాడు. ఇక చేసేదేమీ లేదు హౌస్ లో అయినా బయట అయినా అని ఎలిమినేషన్ ముందే హింట్ ఇచ్చేశాడు నాగార్జున.

ఇక ఒక్కొక్కరు హౌస్ లో ఎలా ఉన్నారో చెప్తూ.. వారి తప్పులని చూపించిన నాగార్జున.. సేవింగ్ ఏమీ లేదు డైరెక్ట్ ఎలిమినేషన్ అంటు నామినేషన్ లో ఉన్న అందరిని నిల్చోబెట్టి.. తలో ఫేక్ గన్ ఇచ్చి.‌ గన్ పేలిన సౌండ్ వస్తే ఎలిమినేషన్ అని చెప్పాడు. ఇక కాసేపటికి అశ్వినిశ్రీ ఎలిమినేటెడ్, మిగిలిన వాళ్ళంతా సేఫ్ అని నాగార్జున అన్నాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.