English | Telugu
సీరియల్ బ్యాచ్ గ్రూపిజం బయట పెట్టిన నాగార్జున!
Updated : Nov 26, 2023
బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే ఉల్టా పుల్టా అంటూ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతీ వారం కొత్త టాస్క్ లు కొత్త గొడవలు జరుగుతున్నాయి. అయితే ఫ్యామిలీ వీక్ తర్వాత కంటెస్టెంట్స్ అంతా నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. శనివారం నాటి ఎపిసోడ్ లో ఎవరేమి తప్పులు చేసారో చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. అలాగే సీరియల్ బ్యాచ్ గ్రూప్ గా ఆడుతుందని చూపించాడు.
"మొన్నటి టాస్క్ లో శోభాశెట్టిని విఐపీ బెడ్ రూమ్ లోని వాష్ రూమ్ వాడుకోమని చెప్పావ్. యావర్ ని మెయిన్ వాష్ రూమ్స్ కి పంపించావ్. ఇదేం ఆట" అని ప్రియాంకని నాగార్జున అనగానే.. సర్ అది తెలుసు అని నవ్వింది ప్రియాంక. "ఇది నవ్వాల్సిన టైమ్ కాదు ప్రియాంక. యూ ఆర్ రాంగ్. అన్ ఫెయిర్. ఇన్ని వారాల నుండి చూస్తున్నాం. పన్నెండు వారాలు అయిపోయింది. ఇంకెప్పుడు నీ గేమ్ ఆడతావ్. శోభాశెట్టి కోసం ప్రియాంక, అమర్ కోసం శోభాశెట్టి, అమర్ కోసం ప్రియాంక .. ఇక మీరు ముగ్గురేనా.. అసలు హౌస్ లో ఇంకెవరు లేరా" అంటూ గట్టిగా క్లాస్ పీకాడు నాగార్జున. ప్రియాంక కెప్టెన్ అయ్యాక.. శోభాశెట్టి, అమర్ దీప్ ఇద్దరు డిప్యూటీలు, శోభాశెట్టి కెప్టెన్ అయ్యాక ప్రియాంక, అమర్ దీప్ డిప్యూటీలు. ఇక అమర్ దీప్ కెప్టెన్ అయ్యాక మళ్ళీ వాళ్ళిద్దరే అని అనేసరికి శివాజీకి నచ్చలేదు. అందుకే అర్జున్ కోసం స్టాండ్ తీసుకున్నాడనే క్లారిటీ ఇచ్చాడు నాగార్జున.
ఇక శోభాశెట్టి, గౌతమ్ లని ఇద్దరిని లేపి గతవారం బాల్స్ విసిరేసే టాస్క్ లో మీ ఇద్దరికి ఏదో కన్ఫూజన్ ఉంది కదా అని నాగార్జున అడిగాడు. అవునని ఇద్దరు అనగా.. వీడియో వేసి చూపించాడు. అమర్ దీప్ ని టార్గెట్ చేస్తూ గౌతమ్ బాల్స్ వేస్తుంటే.. అలా ఒక్కడినే టార్గెట్ చేసి వేయొద్దు. ఇద్దరిని కొట్టు అని శోభాశెట్టి అన్నట్టుగా ఆ వీడియోలో ఉంటుంది. ఇక శోభాశెట్టి కవర్ చేసుకోడానికి.. నేను ప్రియాంక అనే వర్డ్ మెన్షన్ చేయలేదని చెప్తుంది. అది చూసి అంబటి అర్జున్ ని లేపి నీకేం అర్థమైందో చెప్పమని అంటాడు. ఇద్దరిని కొట్టమని శోభాశెట్టి అంది. అంటే ప్రియాంకని కొట్టమనే అర్థం అని అంబటి అర్జున్ అంటాడు. ఇక ప్రియాంక కూడా అదే అంటుంది. అమర్ దీప్ ని అడిగితే.. నాకేం అర్థం కాలేదు సర్. నేను గేమ్ పోతుందనే టెన్షన్ లో ఉన్నానని చెప్తాడు. అలా మొత్తానికి సీరియల్ బ్యాచ్ చేసే మోసాలని, గ్రూప్ గా ఆడే విధానాన్ని ప్రేక్షకులకు చూపిస్తూ వారి బండారం బయటపెట్టాడు నాగార్జున.