English | Telugu

గోవాలో కూతురికి ట్రీట్ ఇచ్చిన సురేఖావాణి!

కూతురు సుప్రీతతో నటి సురేఖావాణి ఓ కన్నతల్లిగా కంటే స్నేహితురాలిగా, పెద్దక్కలా సన్నిహితంగా ఉంటారు. అమ్మాయితో కలిసి డ్యాన్సులు చేస్తారు, జోకులు వేస్తారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వీళ్లిద్దరూ చేసే హల్‌చల్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు కూతుర్ని తీసుకుని సురేఖావాణి గోవా వెళ్లారు. ఎందుకో తెలుసా? ఆదివారం సుప్రీత పుట్టినరోజు. గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం కోసం అక్కడికి వెళ్లారన్నమాట.

"హ్యాపీ బర్త్ డే కన్నా (చిట్టితల్లి మా). మీ నాన్న నిన్ను అలానే పిలిచేవారు. ఆయన్ను నువ్వెంత (మనమెంత) మిస్ అవుతున్నావో నాకు తెలుసు. నీకు బెస్ట్ ఇవ్వడానికి నేనెప్పుడూ ప్రయత్నిస్తా. నా మనసులో ఏముందో, బయట ఏముందో? తెలిసిన వ్యక్తి నువ్వే. నిస్సందేహంగా నా జీవితంలో జరిగిన అద్భుతం నువ్వే. ప్రపంచంలో బెస్ట్ డాటర్‌ను ఇచ్చిన భగవంతుడికి థాంక్స్. నీకంటే ఎక్కువగా ఈ జీవితంలో ఎవర్నీ ప్రేమించలేను. నో... నో.. నో... వచ్చే జీవితంలోనూ ప్రేమించలేను. నీకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా" అని సురేఖావాణి పోస్ట్ చేశారు.

గోవాలో కుమార్తెతో కలిసి సురేఖావాణి చేసిన డ్యాన్సులు వైరల్ అవుతున్నాయి. గ్లామర్ డ్రస్సుల్లో ఇద్దరూ సందడి చేశారు. నెటిజన్స్ చేసిన కామెంట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. "నీ కాళ్ళను పట్టుకుని వదలనన్నవి చూడే నాకళ్ళు" అని ఒకరు కామెంట్ చేశారు. "నిన్ను చూడాలో, నీ కూతుర్ని చూడాలో అర్థం కావడం లేదు" అని ఇంకో కామెంట్. "ఎవరు తల్లి? ఎవరు కూతురు? నేను కన్‌ఫ్యూజ్ అవుతున్నా. ఇద్దరూ సెక్సీగా ఉన్నారు" అని ఒకరు కామెంట్ చేశారు. ఇద్దరు కాళ్ళు సెక్సీగా ఉన్నాయని కొందరు కామెంట్లు చేశారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.