English | Telugu
'ముత్యమంత ముద్దు' పాటలో ఉప్పెనంత అందం!
Updated : Aug 9, 2021
ఓ బుల్లితెర ధారావాహికను ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం జీ తెలుగు ఛానల్ 'ఉప్పెన' హీరోయిన్ కృతి శెట్టి సాయం తీసుకుంటోంది. ప్రచార చిత్రంలోకి మాత్రమే కాదు, కొత్తగా విడుదల చేసిన పాటలో కూడా ఆమెను చూపించింది. ధారావాహికలో హీరో హీరోయిన్ల ప్రేమకథకు కృతి శెట్టి చేస్తే 'వావ్! వాట్ ఏ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఆల్ ద బెస్ట్' అని కాంప్లిమెంట్ కూడా ఇప్పించింది.
'ముత్యమంత ముద్దు' టైటిల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. అందులో లీడ్ పెయిర్ సిద్ధు, నిషా రవిక్రిష్ణన్ మధ్య ప్రేమకథను చూపించారు. 'ఇదేం మనసో... అదే పనిగా నిన్ను చూస్తోంది' అంటూ మొదలైన పాట నిషాను చూడగానే సిద్ధు ప్రేమలో పడ్డాడనే విషయాన్ని తెలియజేస్తోంది. సినిమా పాటలకు ఏమాత్రం తీసిపోని రీతిలో పాటను చిత్రీకరించారు. మధ్య మధ్యలో కృతి శెట్టిని చూపించారు.
'ముత్యమంత ముద్దు' సాంగ్‌లో ప్రేమకథను మాత్రమే చూపించారు. అయితే, అంతకు ముందు విడుదల చేసిన ప్రోమోలో కాన్సెప్ట్ ఏంటో చెప్పారు. రుణం పేరుతో దారుణాలు చేసే అత్త... కన్నవాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని ఆలోచించే కోడలు... ఇద్దరి మధ్య ఏం జరిగిందో త్వరలో ప్రారంభమయ్యే సీరియల్ లో చూడాలి.