English | Telugu
అమ్మానాన్నలు ఇద్దరినీ మా నాన్నలో చూసుకుంటాను!
Updated : Aug 8, 2021
"నాకు మా నాన్నగారు అంటే చాలా చాలా చాలా ఇష్టం" అని నటి ఇంద్రజ అన్నారు. తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని, తండ్రి గొప్పదనాన్ని 'సిక్త్స్ సెన్స్' షోలో వివరించారు. ఓంకార్ హోస్ట్ చేస్తున్న 'సిక్త్స్ సెన్స్' నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంద్రజ, సుధీర్ సందడి చేయనున్న సంగతి తెలిసిందే. అందులో సుధీర్ మీద ఇంద్రజ పంచ్ డైలాగ్స్ వేసిన ఒక ప్రోమోను విడుదల చేశారు కూడా! లేటెస్ట్ ప్రోమోలో తండ్రీకూతుళ్ల మధ్య బంధాన్ని హైలైట్ చేశారు. 'నాన్నంటే చాలా ఇష్టం కదా' అని ఓంకార్ అడిగిన వెంటనే 'చాలా చాలా చాలా చాలా అండీ' అని ఇంద్రజ చెప్పారు.
"నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఇంట్లో మా నాన్నగారే వంట చేశారు. మా అమ్మకి మెడిసిన్ అందివ్వడం గానీ, అమ్మవాళ్లను చూసుకోవడం గానీ... మమ్మల్ని (పిల్లల్ని), మా బాగోగులు చూసుకోవడం... తల్లి, తండ్రి ఇద్దర్నీ కలిపి నేను నాన్నగారిలో చూసుకుంటాను. ఐలవ్యూ. ఐలవ్యూ సో మచ్ నాన్నా" అని ఇంద్రజ గొప్పగా చెప్పారు.
"తండ్రి ప్రేమను మనం పెద్దగా గుర్తించం. కానీ, వాళ్ళే లేకపోతే కుటుంబం అన్న ఒక బంధమే లేదు. ప్రతి ఒక్క తండ్రికి తలవంచి నేను నమస్కరిస్తున్నా" అని ఇంద్రజ సంస్కారాన్ని చాటుకున్నారు.