English | Telugu

బిగ్ బాస్ దత్తపుత్రికకి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన శివాజీ!

బిగ్ బాస్ సీజన్-7 లో నామినేషన్ ప్రక్రియ మాములుగా లేదు. ప్రతీ వారం ఒక ఎత్తు అయితే ఈ వారం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. గౌతమ్ ఎలిమినేషన్ అవ్వడం, అంబటి అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచి నామినేషన్ నుండి సేవ్ అవ్వడంతో.. ఇక డైరెక్ట్ స్పై బ్యాచ్ కి స్పా బ్యాచ్ కి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.

నేటి ప్రోమోలో పద్నాలుగవ వారం చివరి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో యావర్ ని టార్గెట్ చేసి శోభాశెట్టి నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. నువ్వు బ్లైండ్ గా వేరే వాళ్ళ మాట వింటావ్ అని శోభాని యావర్ అనగా.. శెట్టి యు ఆర్ ఫినిష్ అని నువ్వు రాయడం నాకు నచ్చలేదని శోభా అంది. అమర్ దీప్ బ్రెయిన్ వాడుతున్నాడా? నేను కిచెన్ లో తక్కువ యాక్టివ్ గా ఉన్నానా అని ప్రియాంకని యావర్ అడుగగా.. పని తక్కువ చేయడం అనడం వేరు అని ప్రియాంక డిఫెండ్ చేసుకోగా.. శోభా కూడా కిచెన్ లో తక్కువ పనిచేస్తుంది కదా అని యావర్ అన్నాడు. ఇక వీరిమధ్యలోకి శోభా దూరి.. డోంట్ కంపేర్ విత్ మి.. నువ్వేం చేస్తావ్ ? వస్తావ్ తింటావ్ వెళ్తావ్ అని యావర్ మీద అరిచేసింది శోభాశెట్టి.

శివాజీని శోభాశెట్టి నామినేట్ చేసింది. రీజన్ చేస్తూ.. ‘ మీరు ఎందుకో ఒక చోట గివప్ ఇచ్చారనిపించింది ’ అని చెప్పింది. గివప్ ఇవ్వడం గురించి శోభా చెప్పడం భలే కామెడీగా అనిపించింది. అయిన తెలిసి గివప్ ఎందుకిస్తానమ్మ.. రేస్ లో ఉండాలనుకుంటా కదా అమ్మా అని శివాజీ అన్నాడు. ఆ తర్వాత.. ‘అమర్ నిన్న ఫౌల్ గేమ్ ఆడాడని నాగార్జున గారు వీడియోలో చూపించారు కదా.. మరి అతన్ని ఎందుకు నామినేట్ చేయలేదు. అది నీకు తప్పనిపించలేదా' అని శివాజీ అన్నాడు. అంటే దానికి నేను నామినేషన్ చేయాలని అనుకోలేదు.. నేను ఇంతే అంటూ ఎప్పటిలాగే అడ్డదిడ్డంగా సమాధానం ఇచ్చింది శోభాశెట్టి. చివర్లో శివాజీ కొట్టిన డైలాగ్ అయితే నెక్స్ట్ లెవల్.. ‘చూడు శోభా.. నువ్వేదైన ఒలింపిక్ పర్ఫామెన్స్ ఇచ్చి నన్ను నామినేట్ చేస్తే డెఫినెట్ గా నీ నామినేషన్ ని యాక్సెప్ట్ చేసేవాడిని ’ అని అన్నాడు. దీన్ని బట్టి చూస్తే నామినేషన్ లో స్పై వర్సెస్ స్పా మధ్య గట్టిగానే ఆర్గుమెంట్స్ జరిగినట్టున్నాయి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.