English | Telugu
మేము కలిసినప్పుడు అక్కడ లైట్ లేదు.. ఏ ఛీఛీ!
Updated : Nov 24, 2025
సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇది జోడీస్ స్పెషల్ గా రాబోతోంది. ఇక ఈ షోకి నిరుపమ్ - మంజుల పరిటాల, అంజలి - పవన్ తోట, అనిల్ - ఆమని గీలా జోడీస్ వచ్చారు. "మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది" అని అనిల్ ని అడిగింది సుమ. సమాధానం చెప్పలేక తడబడ్డాడు. దాంతో సుమ మళ్ళీ పంచ్ వేసింది "ఎన్నో పెళ్లి అని అడగలేదు" అని చెప్పింది. దాంతో అందరూ నవ్వేశారు. తర్వాత నిరుపమ్ - మంజుల పరిటాలను అడిగింది. "మీ ఆయన బర్త్ డే" అనగానే ఆగష్టు 17 " అని మంజుల చెప్పింది. "మీ బాబు పుట్టిన డేట్ " అని అడిగేసరికి బాబు, బాబు, మా బాబు అని నిరుపమ్ తడబడ్డాడు కానీ ఆన్సర్ చెప్పలేదు.
తర్వాత అంజలి - పవన్ తోట దగ్గరకు వచ్చింది. "మీ ఆవిడని ఫస్ట్ టైం మీరు ఏ కలర్ శారీలో చూసారు" అని అడిగింది. "బ్లూ" అని చెప్పాడు పవన్ . "ఇంత టైం ఇచ్చినా కూడా తప్పు చెప్పాడు.. ఏ అమ్మాయి వచ్చింది బ్లూ కలర్ లో" అని అడిగేసింది అంజలి. "అక్కడ లైట్ బ్లూ కలర్ లో ఉంది కాబట్టి డ్రెస్ బ్లూ కలర్ లో కనిపించింది. "అసలు అక్కడ లైట్ లేదు" అని అంజలి అనేసరికి "ఏ ఛీఛీ తప్పుగా అనుకుంటారు" అంటూ పవన్ కంట్రోల్ చేసాడు. "అంటే మేము పగలు కలిశామండి" అని చెప్పింది అంజలి.