English | Telugu

"మ‌మ్మ‌ల్ని క్ష‌మించండి".. జ‌బ‌ర్ద‌స్త్‌కు టాటా చెప్పి ఏడ్చేసిన‌ సుడిగాలి సుధీర్ టీమ్!

కామెడీ షోల‌లో 'జ‌బ‌ర్ద‌స్త్' ఒక ట్రెండ్ సెట్ట‌ర్‌. ఎంట‌ర్‌టైన్‌మెంట్ చాన‌ళ్ల‌న్నీ కూడా కామెడీ షోల‌ను ఆశ్ర‌యిస్తున్నాయంటే ఈటీవీలో ప్ర‌సార‌మ‌వుతూ వ‌స్తోన్న 'జ‌బ‌ర్ద‌స్త్‌', 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్' షోలు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌వ‌డ‌మే. ఆ షోలు వ‌స్తున్న టైమ్‌కు వేరే చాన‌ళ్ల ప్రోగ్రామ్‌లు చూసేవాళ్లు త‌క్కువైపోయారు. ఆఖ‌రుకు జ‌బ‌ర్ద‌స్త్ కార‌ణంగా కామెడీ సినిమాల హ‌వా త‌గ్గిపోయింది. భిన్న‌త‌ర‌హా కామెడీ సినిమాలైతే త‌ప్ప సంప్ర‌దాయ కామెడీ సినిమాల‌కు కాలం చెల్లిపోయింద‌నే ప‌రిస్థితి త‌లెత్తిందంటే.. 'జ‌బ‌ర్ద‌స్త్' ప్ర‌భావం అలాంటిది. ఏదైనా కామెడీ సినిమా రిలీజైతే దానికంటే 'జ‌బ‌ర్ద‌స్త్' షో బెట‌ర‌నే లెవ‌ల్‌కు ఆ షో చేరుకుంది. ఎంతోమంది క‌మెడియ‌న్లు ఆ వేదిక ద్వారా పాపుల‌ర్ అయ్యారు. వారిలో సుడిగాలి సుధీర్ టీమ్ ముందు వ‌రుస‌లో ఉంటుంది.

'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్' షోలో క‌నిపించే ఈ టీమ్‌లో సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, ఆటో రామ్‌ప్ర‌సాద్ ముఖ్యులు. ఈ ముగ్గురూ మంచి దోస్త్‌లు కూడా. సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి వ్యూయ‌ర్స్‌ను న‌వ్వుల్లో ముంచెత్తుతూ వ‌చ్చిన ఈ టీమ్ ఇక జ‌బ‌ర్ద‌స్త్‌కు టాటా చెప్తోంది. అవును. లేటెస్ట్‌గా వ‌చ్చిన ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ ప్రోమోలో ఈ విష‌యాన్ని ఆ టీమ్ అనౌన్స్ చేసింది.

Also read:'అన్‏స్టాపబుల్'లో ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై స్పందించిన బాలయ్య!

'సుధీర్ స్పెష‌ల్ స్కిట్' పేరుతో ఆ టీమ్ మొద‌ట న‌వ్వులు పంచింది. రాకెట్ రాఘ‌వ ఇంటికి వెళ్లి, అత‌డికి షాక్ ఇద్దామ‌నుకున్న సుధీర్ బ్యాచ్‌కు రాఘ‌వ కొడుకు మురారి చుక్క‌లు చూపించాడు. సుధీర్‌నైతే ఓ ఆట ఆడేసుకున్నాడు కూడా. ఆ త‌ర్వాత ఆ బ్యాచ్.. హైప‌ర్ ఆది ఇంటికి వెళ్లింది. అక్క‌డ సుధీర్‌, ఆది మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ అయితే తెగ నవ్వించింది.

Also read:బిగ్‌బాస్ : ఇంత‌కీ 13 వారాల‌కు పింకీకి ఎంత ద‌క్కింది?

ఆ త‌ర్వాత జ‌బ‌ర్ద‌స్త్ స్టేజి మీద‌కు వ‌చ్చిన సుధీర్‌, శ్రీ‌ను, రామ్‌ప్ర‌సాద్‌లు తాము ఆ షోను వీడ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
శ్రీ‌ను - "చాలా రోజుల నుంచి ముగ్గురం క‌లిసి జ‌బ‌ర్ద‌స్త్‌కి.. ఇక‌పై జ‌బ‌ర్ద‌స్త్ నుంచి మేము.."
రామ్‌ప్ర‌సాద్ - "మేము ఇంట‌ర్వ్యూలో చెప్దాం అనుకున్నాం. ఈ స్టేజ్ మీద చెప్పాల్సి వ‌స్తోంది. మ‌మ్మ‌ల్ని క్షమించండి.."
శ్రీ‌ను - "మ‌మ్మ‌ల్ని నిజంగా క్ష‌మించండి."
రామ్‌ప్ర‌సాద్ - "ఇన్ని రోజులూ మ‌మ్మ‌ల్ని ఆద‌రించినందుకు.." అని చేతులు జోడించి దండం పెట్టాడు. శ్రీ‌ను రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకుని, రుద్దుకున్నాడు.
ఆఖ‌రున సుధీర్‌, శ్రీ‌ను, రామ్‌ప్ర‌సాద్‌.. ముగ్గురూ ఒక‌ర్నొక‌రు కావ‌లించుకొని ఏడ్చారు.

Also read:అన‌సూయ‌, ఆది.. వారం వారం డిన్న‌ర్‌కు వెళ్తారా?

నిజంగానే ఈ టీమ్ 'జ‌బ‌ర్ద‌స్త్‌'కు టాటా చెబుతోందా లేక ఇది కూడా స్కిట్‌లో భాగ‌మా అనేది తెలియాలంటే 10వ తేదీ ప్ర‌సార‌మ‌య్యే ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.