English | Telugu
ఫాన్స్ కి స్వీట్ న్యూస్..జబర్దస్త్ లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్న గాలోడు!
Updated : Nov 5, 2022
స్మాల్ స్క్రీన్ హీరో ‘సుడిగాలి సుధీర్’ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా ఆడియన్స్ కి దగ్గరై ఆ తరువాత ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా బాగా పాపులర్ అయ్యాడు.
మరో వైపు బిగ్ స్క్రీన్ మీద అడపాదడపా నటిస్తున్నాడు. తాను నటించిన "గాలోడు" మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “6 నెలల క్రితం నేను ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాను. ఆ విషయాన్ని జబర్దస్త్ మానేజ్మెంట్ కి చెప్పి ఆ సమస్యలు తీరిపోయాక తిరిగి వస్తానని చెప్పి మరీ వెళ్లాను. ఇప్పుడు డబ్బు సమస్యలు తీరిపోయాయి. మళ్ళీ జబర్దస్త్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని... అవకాశం ఉంటే చెప్పమని చెప్పాను దానికి వారు కూడా సరే అన్నారు.
త్వరలోనే జబర్దస్త్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నాను” అని తన ఫ్యాన్స్ కి ఒక స్వీట్ న్యూస్ చెప్పేసాడు. జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాక హీరోగా కాస్త బిజీ అయ్యాడు కానీ హోస్ట్ గా మాత్రం తన స్థాయికి తగ్గ షోస్ చేయలేదనే విషయం తెలిసిందే. ఇక వచ్చే వారమో ఆ పై వారమో సుధీర్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తాడు.