English | Telugu
గంగూభాయ్ గెటప్ లో శ్రీముఖి!
Updated : Nov 5, 2022
బుల్లితెర మీద ఇటీవల ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎన్నో రియాలిటీ షోస్ కూడా అలరిస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నే కూడా ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటివి ఉన్నవి..వీటితో పాటు ప్రతీ శని, ఆదివారాల్లో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ రూపుదిద్దుకుంటూనే ఉన్నాయి.
ఇక పండగల టైంలో చెప్పక్కర్లేదు. ఇలాంటి ప్రోగ్రామ్స్ లో భాగంగా లేటెస్ట్ గా ‘మిస్టర్ & మిసెస్’ అనే రియాలిటీ షో ఒకటి స్టార్ట్ అయ్యింది. స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోలో నటుడు , బిగ్ బాస్ కంటెస్టెంట్ శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మంగళవారం రాత్రి ఈ షో ప్రసారమవుతుంది. ఇక ఇప్పుడు ఈ షోకి సంబందించిన కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది.
తాజాగా కొత్త ప్రోమో రిలీజ్ చేశారు షో మేకర్స్. వచ్చే వారం కొత్తగా ఒక థీమ్ ని ప్లాన్ చేశారు. " గెటప్ థీమ్ "తో ఆడియన్స్ ని అలరించడానికి కపుల్ కంటెస్టెంట్స్ రెడీ అయ్యారు. అయితే.. గెటప్ థీమ్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి రెగ్యులర్ గెటప్ లో కాకుండా.. కొత్త గెటప్ లో ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసింది. అలియా భట్ పోషించిన ‘గంగూబాయ్ కతియావాడి’ గెటప్ లో వైట్ శారీతో వెన్నెలలా వచ్చేసింది. తెల్లటి చీరకట్టుకొని.. నల్ల కళ్లద్దాలు.. నుదుటిపై ఎర్రని బొట్టు ఇలా వేషధారణతో ఆకట్టుకుంది శ్రీముఖి. దీంతో గంగూబాయి గెటప్ లో శ్రీముఖిని చూసి నటుడు శివబాలాజీ కంప్లిమెంట్స్ ఇచ్చాడు.