English | Telugu
వామ్మో సుదీర్ బాత్‌రూమ్ చూస్తే మైండ్ పోవాల్సిందే?
Updated : Jul 17, 2024
ఒకప్పుడు సెలబ్రిటీస్ ఇళ్ళు ఎలా ఉంటాయి...అసలు వాళ్ళ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి...ఎంత పెద్దగా ఉంటాయి అనే లాంటి ఎన్నో సందేహాలు ఫాన్స్ లో, ఆడియన్స్ లో ఎక్కువగా ఉండేది. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది. ఎందుకంటే ప్రతీ ఒక్కళ్ళు హోమ్ టూర్స్ చేసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. దాంతో ఫాన్స్, ఆడియన్స్ కల నెరవేరింది. చిన్నా,పెద్దా సెలబ్రిటీస్ అనే తేడా లేకుండా వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో బాల్కనీ, వంట గది, వరండా, బెడ్ రూమ్, ఇట్లా రూములన్నీ కూడా చూపించేసి వర్ణించేస్తూ వీడియోస్ ని షేర్ చేస్తూ ఉన్నారు.
ఐతే బుల్లితెర ఫేమస్ యాంకర్ ఫేమస్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇళ్ళు ఎలా ఉంటుందా అనే సందేహం రాకుండా ఉండదు. ఐతే సుధీర్ ఇంటి విషయం ఏమో కానీ బాత్ రూమ్ మాత్రం కనిపించింది. దాన్ని రివీల్ చేసింది కూడా ఎవరో కాదు వర్ష లవర్, సుధీర్ ఫ్రెండ్ ఇమ్మానుయేల్. ఫామిలీ స్టార్స్ రీసెంట్ ప్రోమోలో ఈ బాత్ రూమ్ టూర్ చేసి చూపించాడు ఇమ్ము. ఇక బాత్ రూమ్ చూసేసరికి మైండ్ పోవాల్సిందే అన్నట్టుగా ఉంది. "ఇది సుధీర్ అన్న బాత్ రూమ్ ఫ్రెండ్స్... సుధీర్ అన్నకు ఎందులో ఐనా కూడా తోడు కావాలి కాబట్టి ఇలా తోడు కోసం రెండు కామోడ్స్ పెట్టించేసుకున్నాడు.." అంటూ రన్నింగ్ కామెంటరీ చెప్పేసరికి సుధీర్ నవ్వాపుకోలేకపోయాడు. "చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారు" అంటూ నవ్వుకున్నాడు. ఐతే నెటిజన్స్ మాత్రం సుధీర్ ని అలా కామెంట్ చేసిన ఇమ్ముని తిడుతున్నారు. "ఇమ్ము అన్నా నువ్వు సుధీర్ అన్నని కామెంట్ చేసేంత సీన్ లేదు...లిమిట్ లో ఉండు..." అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు.