English | Telugu
ఆప్షన్స్ ఎక్కువ కావడంతోనే..డివోర్స్ లు బాగా పెరిగాయి
Updated : Jul 29, 2025
ఫ్యామిలీ స్టార్ షో ఈ వారం ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ముఖ్యంగా ఇందులో పెళ్ళైన వాళ్ళను, పెళ్లి కానీ వాళ్ళను తీసుకొచ్చారు. దాంతో ఇద్దరి మధ్య పెళ్లి ఎందుకు అవసరం, పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, చేసుకోకపోతే ఏమవుతుంది అనే పాయింట్ మీద డిబేట్ జరిగింది. ఇక సుధీర్ కూడా పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు. "మనం పెళ్లి చేసుకున్నాక ఎక్కడున్నావు ఎం తిన్నావు అని అడుగుతుంటే మనం రెస్ట్రిక్టెడ్ గా ఫీలవుతున్నాం కాబట్టే మనకు అది నచ్చట్లేదు. అదే మనం మన పార్టనర్ ని ప్రేమించడం స్టార్ట్ చేస్తే లైఫ్ చాల హ్యాపీగా ఉంటుంది.
ఇక పెళ్లి విషయానికి వస్తే ఇంతకు ముందు ఉన్న జనరేషన్ లా ఈ జనరేషన్ లేదు. డివోర్స్ లు తీసుకోవడం ఎందుకు ఎక్కువగా పెరిగాయి అంటే ప్రతీ ఒక్కరికీ రకరకాల ఆప్షన్స్ అనేవి ఈజీగా అందుబాటులోకి వచ్చేసాయి. మొబైల్, సోషల్ మీడియా పెరిగాక అషన్స్ ఎక్కువైపోయాయి. దాంతో పార్టనర్ దగ్గర ఏదైతే దొరకదు దాన్ని ఆ ఆప్షన్ ద్వారా తీర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పెళ్లి చేసుకోవడంలో, చేసుకోకపోవడంలో మంచి చెడులు రెండూ ఉంటాయి. కానీ జీవితాన్ని మనం ఎలా చూస్తున్నాం అన్నదే ఇక్కడ ముఖ్యం..పెళ్లి ఐనా కాకపోయినా, చేసుకున్న, చేసుకోకపోయినా ఎప్పుడు ఎలా హ్యాపీగా ఉండాలంటే అలా ఉండొచ్చు " అంటూ సుధీర్ చెప్పుకొచ్చాడు. డాన్సర్ అభినయశ్రీ ఐతే పెళ్లి వద్దు అన్ని అలాగే రీతూ కూడా పెళ్లి కష్టం అన్న లెక్కలో చెప్పారు. కానీ కెవ్వు కార్తీక్, కృష్ణ కౌశిక్ మాత్రం పెళ్లి వేల్యూ గురించి చెప్పారు.