English | Telugu
ది గ్రేట్ యాక్టర్ నా కోటన్న..ఈ షోకి రావాల్సింది కానీ...
Updated : Jul 29, 2025
ఏ రిలేషన్ ఎలా ఫ్రెండ్ షిప్ అనే రిలేషన్ మాత్రం ఎప్పుడూ ఎవర్ గ్రీన్. అలాంటి ఫ్రెండ్ షిప్ డే వస్తున్న సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ "స్నేహమంటే ఇదేరా" పేరుతో ఒక ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర సెలబ్రిటీస్ తో వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేశారు. అలాగే గెస్ట్ గా బాబు మోహన్ వచ్చారు. "మీకు ఒక బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. ఆయన్ని, మిమ్మల్ని కలిపి ఈరోజు పిలుద్దామని అనుకున్నాం. పిలవాల్సింది కానీ" అంటూ రష్మీ ఆగిపోయింది.
ఇక బాబు మోహన్ ముఖంలో ఒక వేదన కనిపించింది. అది ఎవరి గురించో కాదు అందరికి తెలిసిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గురించే. "ది గ్రేట్ యాక్టర్ కోటన్న . నా కోటన్న" అంటూ చెప్పు కొచ్చారు. ఇక వెనకాల బాబుమోహన్ - కోట కలిసి చేసిన మూవీ సీన్స్ ని ప్లే చేశారు. అలాగే కోట చనిపోయినప్పుడు చిరంజీజీవి వెళ్లిన పిక్స్ ని కూడా చూపించారు. ఆటో రాంప్రసాద్ వచ్చి "హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే సర్" అంటూ బాబు మోహన్ ని విష్ చేసాడు. ఆయన కూడా రిటర్న్ లో హ్యాపీ ఫ్రెండ్ షిప్ చెప్పారు. "మీ ఫేమస్ డైలాగ్ చెప్పండి" అని రాంప్రసాద్ అడిగేసరికి "అరేయ్ కేశవా. నాది చూసావా" అని అడిగేసరికి నాటి నరేష్ సిగ్గు పడిపోయాడు. ఇక శ్రీకర్ కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొచ్చి తనకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒక్క ఫోన్ చేస్తే వెంటనే కళ్ళ ముందు ఉంటాడని చెప్పుకొచ్చాడు. తర్వాత మానస్ తన ఫ్రెండ్ ని పరిచయం చేసాడు. "మా స్కూల్ లో యాక్టివిటీస్ ఐతే ఏమీ ఉండవు" అని చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్. "అవుట్ సైడ్ యాక్టివిటీస్ ఉండేవి" అని మానస్ చెప్పేసరికి "ఎలాంటి యాక్టివిటీస్" అని అడిగింది రష్మీ. "అంటే అరేయ్ మావ ఎక్ పెగ టైపు" అన్నట్టుగా ఫేస్ పెట్టాడు.