English | Telugu

రక్ష నింబార్గి గురించి ఎవరికి తెలియని నిజాలు!

బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా టీవీ సీరియళ్ళకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. అందులోను తాజాగా మొదలైన ఎటో వెళ్ళిపోయింది ‌మనసు సీరియల్ కి అప్పుడే ఫ్యాన్ పేజీలు కూడా స్టార్ట్ అయ్యాయి. రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గికి ఇన్ స్టాగ్రామ్ లో సపరేట్ ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. అయితే తను ఇన్ స్టాలో తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

సీతాకాంత్, రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గి ప్రధాన పాత్రలుగా తాజాగా ' ఎటో వెళ్ళిపోయింది మనసు ' సీరియల్ స్టార్ మా టీవీలో ప్రారంభమైంది. భార్యామణి, అష్టా చెమ్మ సీరియల్స్ లలో నటించి సీతాకాంత్ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. రక్ష నింబార్గి కన్నడ భామ. బింగో అనే కన్నడ మూవీతో వెండితెరపై అరంగేట్రం చేస్తుంది. రక్ష నింబార్గి తెలుగులో చేస్తోన్న తొలి సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు. కన్నడ, తమిళ్ నుండి వచ్చిన ఎంతోమంది హీరోయిన్ లు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ తెచ్చుకున్నారు. ప్రియాంక జైన్, పల్లవి గౌడ, రక్ష గౌడ, శోభాశెట్టి ‌ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సీరియల్స్ లలో కన్నడ భామల లిస్ట్ పెద్దగానే ఉంది. ఆ జాబితాలోకి ఇప్పుడు రక్ష నింబార్గి చేరింది.

ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ రామలక్ష్మి, సీతాకాంత్ మధ్యలో చాలానే ఏజ్ గ్యాప్ ఉంది. కానీ వారిది పూర్వజన్మ బంధమని సీరియల్ మొదటి ఎపిసోడ్ లో చూపించారు. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్‌లలో సూపర్ ట్విస్ట్ వచ్చేసింది. రామలక్ష్మి వాళ్ళ నాన్నకి , సీతాకాంత్ వాళ్ళ నాన్న శ్రీలతకి మధ్య ఏదో తెలియని రహస్యం దాగి ఉందని తెలుస్తోంది‌. డైరెక్టర్ పెట్టిన ఈ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అయితే మరి అసలు గతంలో ఏం జరిగిందనేది కీలకంగా మారింది. మరి రామలక్ష్మి, సీతాకాంత్ ల మధ్య ప్రేమ చిగురించేనా? మాణిక్యం, శ్రీలతల మధ్య జరిగిన దాగి ఉన్న మిస్టరీ ఏంటనే క్యూరియాసిటితో ఈ సీరియల్ సాగుతుంది. అయితే రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గి తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ' స్టార్ట్ ఎవ్రీ డే ఆఫ్ విత్ స్మైల్ అండ్ గెట్ ఇట్ ఓవర్ ఇట్ ' అనే క్యాప్షన్ కూడా చేసింది. ప్రతీరోజు నవ్వుతూ స్టార్ట్ చేస్తే రోజంతా హ్యాపీగా ఉంటామని రక్ష నింబార్గి తెలిపింది. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ కి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.