English | Telugu
బిగ్ బాస్ తర్వాత నా మొదటి సినిమా ఇదే : శుభశ్రీ రాయగురు
Updated : Feb 1, 2024
బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన ఎంతోమంది బయటకొచ్చాక ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. సినిమాలలో, సీరియల్స్ లలో తమ ప్రతిభని చాటుతూ ఫేమస్ అవుతున్నారు. కాగా సీజన్ సెవెన్ లో టైటిల్ ఫేవరెట్ గా అడుగుపెట్టిన శుభశ్రీ రాయగురు.. నా మనో భావాలు దెబ్బతిన్నాయి అనే ఆ ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయింది. డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణతో చిన్నగా లవ్ ట్రాక్ నడిపి ప్రేక్షకులలో కాస్త ఇంటెన్స్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా తను ఒక మూవీలో చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.
ఒడిశాలో పుట్టిపెరిగిన ఆమె 2022లో వచ్చిన తెలుగు సినిమా రుద్రవీణ, తమిళ సినిమా డెవిల్ లతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తరువాత 2023లో అమిగోస్, కథ వెనుక కథ వంటి పలు చిత్రాల్లోనూ ఆమె నటించింది. ముంబైలో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసిన శుభశ్రీ.. లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయినప్పటికీ ఆమెకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. అలా 2020లో వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. తర్వాత టెలివిజన్ యాంకర్‌గా మారింది. హిందీ సినిమా మస్తీజాదే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా చేసింది.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదలవ్వడమే ఉల్టా పల్టా థీమ్ తో మొదలైంది. ఎన్నో అంచనాల మధ్య హౌస్ లోని కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి అదరహో అనిపించారు . ఈ సీజన్ సెవెన్ లో లాయర్ కమ్ యాక్టర్ గా శుభశ్రీ అడుగుపెట్టింది. ఓ నామినేషన్ లో అమర్ దీప్ తో జరిగిన గొడవలో.. దమ్ముంటే నామినేషన్ పాయింట్ చెప్పు బ్రో.. మనోభావాలు దెబ్బతిన్నాయి ఏంటి అంటు క్యూట్ గా ఏడ్చేసింది శుభశ్రీ. దాంతో ఒక్కసారిగా ఇన్ స్టాగ్రామ్ లో ట్రోలర్స్ కి కంటెంట్ దొరికినట్టైంది. అప్పటినుండి శుభశ్రీని ట్రోల్స్ లో వాడుకుంటున్నారు మీమర్స్. ఇక బిగ్ బాస్ తర్వాత గౌతమ్ కృష్ణ, శివాజీ, ప్రశాంత్, యావర్ లని కలిసింది. కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన శుభశ్రీ.. టేస్టీ తేజతో కలిసి వ్లాగ్ కూడా చేసింది. భోలే షావలితో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేయగా అది ఫుల్ వైరల్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీలో అవకాశం కొట్టేసిన ఈ భామ తెగ సంబరపడిపోయింది. ఇక తన మొదటి సినిమా చేసినట్టుగా ప్రమోషన్స్ మొదలెట్టేసింది ఈ భామ. పూర్ణ, విధార్త్, త్రిగుణ్, శుభశ్రీ ప్రధానపాత్రలుగా 'డెవిల్' అనే ఓ సినిమా త్వరలో మనముందుకు వస్తోందంటు శుభశ్రీ తన వ్లాగ్ లో చెప్పుకొచ్చింది. చెన్నై కి వెళ్ళి అక్కడ తన మొదటి సినిమాలోని డైరెక్టర్ తో కాసేపు మాట్లాడింది శుభశ్రీ. తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది.