English | Telugu

అందరు ఒక దగ్గర షూటింగ్ చేస్తున్నాం : శ్రీకర్ కృష్ణ!

స్టార్ మా సీరియల్స్ లలో 'బ్రహ్మముడి' సీరియల్ కి ఉండే క్రేజే వేరు. ఇందులో కావ్య-రాజ్ ల జోడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వారిద్దరి తర్వాత రాహుల్-స్వప్నల జోడీ ఫేమస్ అయింది. వారిద్దరి మైండ్ సెట్ దాదాపు ఓకేలా ఉండటమే దీనికి కారణం.

బ్రహ్మముడి సీరియల్ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ సీరియల్ కనకం-కృష్ణమూర్తిల కుటుంబానికి దుగ్గిరాల కుటుంబానికి మధ్య సాగే సన్నివేశాలన్నీ అందరికి బాగా కనెక్ట్ అయ్యాయి. నీపా అలియాస్ కనకం తన పర్ఫామెన్స్ తో అవార్డ్ కూడా సొంతం చేసుకుంది. కావ్య అలియాస్ దీపిక రంగరాజుకి తెలుగులో మొదటి సీరియల్ అయిన తెలుగింటి అమ్మాయిలాగా బాగా చేసింది. హమీద అలియాస్ స్వప్న నెగెటివ్ రోల్ లో చక్కగా ఒదిగిపోయింది. అదే బాటలో రాహుల్ అలియాస్ శ్రీకర్ కృష్ణ కూడా రుద్రాణికి కొడుకుగా ఆకట్టుకుంటున్నాడు. తల్లి బాటలో ఎత్తుకి పై ఎత్తు వేస్తూ బ్రహ్మముడి సీరియల్ ని ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇప్పుడు ఈ సీరియల్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీలతో మరింత ఉత్కంఠభరితంగా మారింది.

శ్రీకర్ కృష్ణ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. అలాగే యూట్యూబ్ లో సొంతంగా ఓ ఛానెల్ మొదలెట్టి అందులో తను చేస్తున్న శతమానం భవతి, బ్రహ్మముడి సీరియల్స్ గురించి రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తున్నాడు. అయితే నిన్న జరిగిన షూటింగ్ లో ఓ లొకేషన్ లో శతమానం భవతి, సుందరి, పలుకే బంగారమాయేరా, వంటలక్క, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ అన్నీ ఒకే దగ్గర షూటింగ్ జరిగాయంట. దాంతో అక్కడ ఉన్నవారితో శ్రీకర్ కృష్ణ అలియాస్ రాహుల్ ఓ వ్లాగ్ చేసాడు. సుందరీ సీరియల్ లోని హీరో, హీరోయిన్ లతో మొదటగా మాట్లాడిన శ్రీకర్ కృష్ణ.. అ తర్వాత కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆదర్శ్ తో కాసేపు మాట్లాడాడు. ఇక అదే సీరియల్ లో చేస్తోన్న మధుతో కలిసి సరదాగా కబుర్లు చెప్పాడు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.