English | Telugu
కీర్తికి ఫస్ట్ వాలైంటైన్ సర్ ప్రైజ్ ఇచ్చిన కార్తిక్!
Updated : Feb 17, 2024
ఎన్నో రోజులు వస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ అంటు వాలైంటైన్ వీక్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు కొందరు. అయితే ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తమకి తోచిన విధంగా జరుపుకుంటున్నారు. బిగ్ బాస్ కీర్తీ భట్ తన సోల్ మేట్ కార్తీక్ తో కలిసి వాలైంటైన్స్ డే ని జరుపుకుంది. అదంతా తన వ్లాగ్ లో పోస్ట్ చేయగా అది ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది.
బిగ్ బాస్ సీజన్-6 లో టాప్-5 లో ఉన్న కంటెస్టెంట్స్ లలో కీర్తిభట్ ఒకరు. హౌస్ లోకి వెళ్ళిన మొదటి వారం నుండి ప్రతీదానికి ఏడుస్తుంటే ఏంట్రా బాబు ఈ అమ్మాయి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందా అని ప్రేక్షకులు మొదట్లో అనుకునేవారు. అయితే ఒకరోజు మీ కుటుంబం గురించి చెప్పుకోండి అని బిగ్ బాస్ ప్రతీ కంటెస్టెంట్ కి అవకాశం ఇచ్చినప్పుడు కీర్తిభట్ తన గురించి చెప్పుకుంది. తన ఫ్యామిలీ అంతా ఒక యాక్సిడెంట్ లో చనిపోయారని, ఆ తర్వాత ఒక పాపని దత్తత తీసుకొని పెంచుకుంటే తను కూడా దూరమైందని భాదపడుతూ చెప్పుకుంది. ఇక హౌస్ లోకి వచ్చేముందు మరో పాపని దత్తత తీసుకుందంట మరి ఆ పాప ఎలా ఉందోనని బాధపడుతూ చెప్పుకోవడం, కీర్తిభట్ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళని చూసి ఎంతో మంది అభిమానులు అయ్యారు.
కీర్తిభట్ హౌస్ లో కెప్టెన్ అయ్యాక హౌస్ మేట్స్ అందరితో మంచి బాండింగ్ ఏర్పడింది. అయితే రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ముగ్గురితో కీర్తిభట్ హౌస్ లో గొడవలు రావడంతో తన గేమ్ కాస్త డిస్టబ్ అయింది. ఆ తర్వాత తను ప్రతీ టాస్క్ లో బాయ్స్ తో గట్టి పోటి ఇస్తూ శివంగిలా ఎదురునిలబడటంతో ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయింది. ఇక తను టాప్-5 లోకి చేరుకుంది. అయితే కీర్తిభట్ కంటే రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డికి అప్పట్లో ఫ్యాన్ బేస్ కాస్త ఎక్కువ ఉండటంతో తను ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ షో తర్వాత మీ ఇంటి కీర్తి అనే యూట్యూబ్ ఛానెల్ ని మొదలెట్టింది కీర్తిభట్. ఇక అందులో రెగ్యులర్ గా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ తన అభిమానులకి దగ్గరగా ఉంటుంది. కొన్ని నెలల క్రితం ఎంగేజ్ మెంట్ చేసుకున్న కార్తిక్, కీర్తిభట్ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారా అని వీరి అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. అయితే వీళ్ళు మాత్రం టూర్స్ ట్రావెల్స్ కి వెళ్తూ వ్లాగ్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నారు.