English | Telugu
మోస్ట్ డిసర్వింగ్ గా శ్రీహాన్, అన్ డిసర్వింగ్ గా మెరీనా!
Updated : Oct 24, 2022
బిగ్ బాస్ హౌస్ లో వారం మొత్తం కంటెస్టెంట్స్ చేసిన తప్పులను చెప్పడానికి, మంచి పనిని మెచ్చుకోడానికి వారాంతంలో నాగార్జున వస్తాడన్న విషయం తెలిసిందే. కాగా కంటెస్టెంట్స్ అందరు భయడపడ్డారు. కానీ అంతలా ఏం వార్నింగ్ ఇవ్వలేదు. కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరుగా కన్ఫెషన్ రూమ్ కి పిలిచి హౌస్ లో ఉండడానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అని చెప్పమన్నాడు.
కాగా హౌస్ మేట్స్ లో ఎక్కువగా శ్రీహాన్ ని డిసర్వింగ్ అని చెప్పారు. తన అటతీరు, మాటతీరు కూడా బాగుంటుంది. ఎక్కడ కూడా టంగ్ స్లిప్ అవ్వడు. గేమ్ లో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఆక్టివ్ గా ఉంటూ అలరిస్తోన్నాడు. మరియు ఇతర టాస్క్ లో పాల్లొంటు ఆకట్టుకుంటాడు అని హౌస్ లో సగానికి పైగా మంది చెప్పారు. శ్రీహాన్ తో పాటుగా రేవంత్, గీతు, సూర్య లు కూడా డిసర్వింగ్ గా ఉండగా, శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు పడడం జరిగింది. శ్రీహాన్ ని ఇనయా గురించి అడుగగా, "ఏంటో సార్ ఈ మధ్య నన్ను పొగిడేస్తోంది" అని చెప్పగా, "లేదు శ్రీహాన్. సూర్య, ఇనయా ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు" అని నాగార్జున చెప్పడంతో శ్రీహాన్ ఆశ్చర్యపోయాడు. అయితే ఇప్పటివరకు శ్రీహాన్ ఎన్ని సార్లు నామినేషన్ లో ఉన్నా కూడా అందరికంటే ముందు టాప్ ప్లేస్ లో ఉంటాడు. దీన్ని బట్టి చుస్తే శ్రీహాన్ విన్నర్ అయ్యే ఛాన్స్ లే ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
మోస్ట్ అన్ డిసర్వింగ్ గా మెరీనాను ఎక్కువ మంది ఎన్నుకొన్నారు. హౌస్ లో జంట గా అడుగుపెట్టిన మెరీనా-రోహిత్ బిగ్ బాస్ విడదీసి విడివిడిగా ఆడమని చెప్పిన విషయం తెలసిందే. కాగా ఇండివిడ్యువల్ గా ఆడడం మొదలు పెట్టిన నుండి రోహిత్ పర్వాలేదు అనిపించినా, మెరీనా మాత్రం ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇవ్వట్లేదు. అటు ఫిజికల్ టాస్క్ లలో, ఇటు మైండ్ గేమ్ లలో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇవ్వడం లేదు. హౌస్ లో సగం కంటే ఎక్కువ మంది మెరీనాని హౌస్ లో ఉండటానికి అనర్హురాలు గా ఓటు వేసి చెప్పారు. వసంతి, రాజ్, అర్జున్ లు కూడా అన్ డిసర్వింగ్ కంటెస్టెంట్స్ కాగా, ఎక్కువగా మెరీనాకి ఓట్లు రావడం వల్ల అన్ డిసర్వింగ్ గా ఎన్నికైంది. ఈ నలుగురు కూడా హౌస్ లో అంతంత మాత్రం పర్ఫార్మన్స్ చేస్తూ, వస్తోన్నారు. అందరికి అన్ డిసర్వింగ్ బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది. "ఇది బిగ్ బాస్ ఆదేశం వచ్చే వరకు తీయకూడదు" అని చెప్పాడు బిగ్ బాస్. ఈ మోస్ట్ అన్ డిసర్వింగ్ ఇక ముందు అయిన ఆటలో తమ పర్ఫామెన్స్ మెరుగుపరుచుకొని, ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి హౌస్ లో కొనసాగుతారో? లేదో ? చూడాలి.