English | Telugu
కొబ్బరిబొండాం మా ఇద్దరినీ కలిపింది!
Updated : Oct 24, 2022
దీపావళి పండగలా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ అందంగా ముస్తాబై వచ్చింది. ఇక ఈ ఎపిసోడ్ ని "మళ్ళీ పెళ్లి" అనే కాన్సెప్ట్ తో నడిపించారు. ఈ ఎపిసోడ్ కి రియల్ భార్య భర్తలు కూడా వచ్చారు. ఇక హరిత, జాకీ ఈ వారం ఎపిసోడ్లో తమ లవ్ స్టోరీ చెప్పి ఎంటర్టైన్ చేశారు. వీళ్ళ ఇద్దరికీ రష్మీ ఒక టాస్క్ ఇచ్చింది. "హరిత గారిని ఫస్ట్ టైం డాన్స్ క్లాస్ లో చూసినప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో చెప్పాలి" అనేసరికి "ఆరోజు గ్రీన్ కలర్ డ్రెస్. నేను ఆ ఇన్స్టిట్యూట్ లో పైన క్లాస్ లో ఉండేవాడిని హరిత కింద క్లాస్ లో డాన్స్ నేర్చుకునేది" అని కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు రష్మీ రెండు స్ట్రాలు వేసి ఉన్న ఒక కొబ్బరి బోండాన్ని ఇద్దరికీ ఇచ్చింది. అప్పుడు జాకీ కొబ్బరిబోండాం పట్టుకుని దీనికి ఒక కథ ఉంది అంటూ అప్పటి జ్ఞాపకాలను చెప్పుకొచ్చాడు.
"అప్పట్లో హరిత చెన్నై నుంచి షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చేది. ఆ రోజుల్లో తాను ఎక్కువగా డైటింగ్ లో ఉండేది. ఒకరోజు తినకుండా నీరసమొచ్చి నిద్రపోయింది. ఒక షూటింగ్ టైంలో మా ఇద్దరికీ ఒకే కార్ పంపించారు. నేను ముందు కూర్చున్నా.. వెనక హరిత పడుకుంది. డ్రైవర్ ని అడిగితే ఆమెకు బాలేదని చెప్పేసరికి దారి మధ్యలో కార్ ఆపమని చెప్పి హరిత కోసం కొబ్బరిబోండాలు, ఎలెక్ట్రోల్ పౌడర్ ప్యాకెట్లు తీసుకుని డ్రైవర్ కి ఇచ్చి నేను వెళ్ళిపోయాను" అని చెప్పాడు జాకీ.
తర్వాత హరిత మాట్లాడుతూ "ఎంత ఒంట్లో బాగోకపోయినా రెడీ ఐపోయి షూటింగ్ కి వెళ్ళిపోతాను. అలా షూటింగ్ లో కూర్చుంటే వెనక నుంచి కొబ్బరి బొండాలు అన్నీ వస్తున్నాయి. ఎవరు తీసుకున్నారు అనేసరికి అప్పుడు డ్రైవర్ చెప్పాడు అసలు విషయం..అలా మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ కొబ్బరిబొండామే మా ఇద్దరినీ కలిపింది అంటూ తమ లవ్ సీక్రెట్ చెప్పారు ఇద్దరూ.