English | Telugu

శ్రీహాన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా?

బిగ్ బాస్ లో కొత్త కెప్టెన్ గా ఎన్నికయిన శ్రీహాన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్న మొన్నటి దాకా జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఎవరి పర్ఫామెన్స్ వాళ్ళు ఇచ్చారు. అందులో ఒక్కొక్కరిని తప్పిస్తూ చివరికి కీర్తి భట్, సూర్య, శ్రీహాన్ మిగలాగా శ్రీహాన్ ని హౌస్ మేట్స్ కెప్టెన్ గా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అయితే "హౌస్ లో వరెస్ట్ పర్ఫామర్ ఎవరో చెప్పి, ఎవరిని జైలుకి పంపించాలనుకుంటున్నావో చెప్పు" అని బిగ్ బాస్, శ్రీహాన్ ‌ని అడుగగా, దానికి సమాధానంగా, "ఆదిత్యను వరెస్ట్ పర్ఫామర్ అని అనుకుంటున్నాను" అని బిగ్ బాస్ తో చెప్పాడు. అయితే దీనికి శ్రీహాన్ ఇచ్చిన సమాధానం సరిగ్గా లేదని ప్రేక్షకులు భావిస్తున్నారు.

నిన్న మొన్నటిదాకా జరిగిన చేపల టాస్క్ లో శ్రీసత్య, శ్రీహాన్ ఒక జట్టుగా ఉన్నారు. అయితే వారి బుట్టలోని చేపలను కాపాడే ప్రయత్నంలో ఉండగా, బాలాదిత్య వచ్చి వారి చేపలు లాక్కునే ప్రయత్నం చేసాడు. ఈ లాక్కునే ప్రయత్నంలో ఆదిత్య కొన్ని మాటలు శ్రీసత్య తో జారాడు అని శ్రీహాన్ ఆరోపించాడు. కానీ అది తప్పు డెసిషన్. ఎందుకంటే ఒక గేమ్ ఆడేటప్పుడు ఎమోషన్స్ అనేవి కామన్, ఆ టైంలో ఒక్కసారి మాటలు జారుతుంటాయి. అసలు విషయం శ్రీసత్యకి, ఆదిత్యకి జరిగింది కానీ శ్రీహాన్ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు.

ఇప్పుడు శ్రీహాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆదిత్య తన గేమ్ తను ఆడటం కూడా తప్పేనా అని శ్రీహాన్ ని విమర్శిస్తున్నారు. కాగా హౌస్ లో కొత్తగా కెప్టెన్ అయిన తర్వాత శ్రీహాన్ తీసుకున్న తొలి నిర్ణయం తప్పు అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.