English | Telugu
'నువ్వెవరివి అందరినీ ఆడేలా చేయడానికి?'.. గీతుపై నాగార్జున ఫైర్!
Updated : Oct 30, 2022
బిగ్ బాస్ హౌస్ లో ప్రతి శనివారం నాగార్జున వచ్చి, టాస్క్ లో మంచిగా పర్ఫామెన్స్ చేసిన వారిని పొగిడి, వరెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారిని తిడతాడనేది అందరికి తెలిసిన విషయమే. కాగా వారం రోజులుగా తన ప్రవర్తనతో అటు హౌస్ మేట్స్ కి, ఇటు ప్రేక్షకులకు చిరాకు తెప్పించిన గీతుకి, నాగార్జున తన స్టైల్ లో గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.
ఆ తర్వాత ఆదిరెడ్డితో "బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ లు ఇవ్వండి, గుద్ది పడేస్తా అని అంది కదా గీతు. మరి ఇప్పుడు ఏది, తను ఫిజికల్ టాస్క్ లో గుద్ది పడేయలేదే" అని అన్నాడు నాగార్జున. ఆదిరెడ్డిని తన ఆట తీరు గురించి రివ్యూ అడుగగా, గీతు మధ్యలో ఏదో మాట్లాడటానికి ప్రయత్నించింది. దాంతో నాగార్జున కోపగించుకున్నాడు. "మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఇలానే మధ్యలో వస్తావ్. ఇది వరకే చెప్పాను కదా నీకు మధ్యలో మాట్లాడకు అని, ఎప్పుడు ఇలానే చేస్తావ్" అని గీతుపై, నాగార్జున సీరియస్ అయ్యాడు.
ఆ తర్వాత "గేమ్ వదిలెయ్. సంచాలక్ గా తన ఆట తీరు ఎలా ఉంది?" అని నాగార్జున అడుగగా, "గేమ్ పర్లేదు సర్. సంచాలక్ గా నాకు బాగా అనిపించలేదు" అని చెప్పాడు ఆదిరెడ్డి. ఆ తర్వాత "బిగ్ బాస్ చరిత్రలో లేని విధంగా నీ ఆటతీరు ఉంది. సంచాలక్ గా రూల్స్ బ్రేక్ చేసావ్. హౌస్ లో అందరిని నీ మాట తీరుతో బాధపెట్టావ్. నీకు కోపమొస్తే కామన్ సెన్స్ మర్చిపోతావా? ఇతరులను తక్కువ చేసి, వాళ్ళ వీక్ నెస్ మీద దెబ్బ కొట్టడానికి ట్రై చేసావ్" అని నాగార్జున అన్నాడు.
దానికి గీతు, " అవును సర్. టాస్క్ లో ఎలాగూ ఎంటర్టైన్మెంట్ లేదు కదా అని అందరిని గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాను. కావాలని రెచ్చగొట్టాను సర్" అని గీతు, నాగార్జునతో చెప్పుకొచ్చింది. "నువ్వు ఎవరివి, అందరినీ ఆడేలా చేయడానికి, ఎంటర్టైన్మెంట్ గురించి బిగ్ బాస్ చూసుకుంటాడు. నీ ఆట నువ్వు ఆడు. అది చూసుకోకుండా ఇలా చేసినందుకే లీస్ట్ లో ఉన్నావ్. నీ ఆట పీత ఆట. అది కూడా అంతే. ఒక పీత పైకి వెళ్తు ఉంటే మరొక పీత వెన క్కి లాగుతూ ఉంటుంది. కాకపోతే అది కూడా వెనకే ఉంటుంది నీలాగా" అని నాగార్జున చెప్పుకొచ్చాడు.
"నీ అట తీరు, మాట తీరు చేంజ్ కావాలి. హౌస్ లో ఉండాలంటే ఆ పని చెయ్యను, ఈ పని చెయ్యను అంటే కుదరదు. సంచాలక్ గా ఫెయిల్ అయ్యావ్. దీనికి పనిష్మెంట్ కచ్చితంగా ఉండాలి" అని కెప్టెన్ అయిన శ్రీహాన్ ని నాగార్జున చెప్పమన్నాడు. శ్రీహాన్ కిచెన్ విజిల్స్ క్లీన్ చెయ్యమన్నాడు. దానికి "సర్.. నేను అది కాకుండా ఏదైనా చేస్తా" అని గీతు అనగా బాత్రూమ్స్ క్లీన్ చెయ్యమని నాగార్జున చెప్పగా గీతు ఒప్పుకుంది.
ఎట్టకేలకు గీతుకి మంచి కౌంటర్ అయితే గట్టిగానే పడింది. నాగార్జున మాట విని హౌస్ లో ఇకనైనా తన ఆటతీరు, మాటతీరు మార్చుకొని, హౌస్ లో బెస్ట్ పర్ఫామర్ గా ఉంటుందో? లేక వరెస్ట్ పర్ఫామర్ గా ఉంటుందో? చూడాలి.