English | Telugu
హ్యాపీ బర్త్ డే అద్విత.. ఇది చాలు బిగ్ బాస్!
Updated : Oct 29, 2022
బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటుగా ఎమోషనల్ సీన్స్ జరుగుతుంటాయి. ఇలాంటివి జరిగినప్పుడే బిగ్ బాస్ ని ప్రేక్షకులు ఎక్కువగా వీక్షిస్తున్నారు. అందుకనే హౌస్ లో ప్రతి ఒక్కరికి సర్ ప్రైజ్ ఇవ్వడంలో బిగ్ బాస్ సాటి ఎవరు రారు అనే చెప్పాలి.
బిగ్ బాస్ గత వారం జరిగిన ఫ్యామిలీ టాస్క్ లో భాగంగా అందరి ఫ్యామిలీలకు దగ్గరికి చేసి వారిలో ఉన్న ఎమోషన్స్ ని బయటపెట్టాడు. ఇలా ఎవరో ఒకరికి ఏదో ఒకటి సర్ ప్రైజ్ ఇస్తూ వస్తోన్నాడు బిగ్ బాస్. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన నేహా చౌదరికి తన పుట్టినరోజు నాడు సర్ ప్రైజ్ ఇవ్వగా, శ్రీహాన్ కి మాత్రం పుట్టినరోజు రోజుకి ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వలేదు. దీంతో హౌస్ మేట్స్ బర్త్ డే సెలబ్రేట్ చేసారు. కాగా ఆదిరెడ్డి కూతురు బర్త్ డే ఉండడంతో ఆదిరెడ్డి గత వారం బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేసుకున్నాడు. తన "నా కూతురు పుట్టిన రోజున తనని వీడియోలో చూడాలనుకుంటున్నా, తన బర్త్ డే సెలబ్రేషన్స్ మిస్ అవ్వొద్దు" అని ఆదిరెడ్డి, బిగ్ బాస్ ని చాలాసార్లు రిక్వెస్ట్ చేసాడు. కాగా నిన్న ఆదిరెడ్డి కూతురు పుట్టినరోజు కావడంతో, పాపతో కేక్ కట్ చేయించిన వీడియోని బిగ్ బాస్ టీవీలో చూపించాడు. ఈ వీడియోలో తన భార్య కవిత మాట్లాడుతూ, "మన కూతురు మొదటి పుట్టిన రోజున ఒక తండ్రిగా, నువ్వు పక్కన ఉండాలి. కానీ నువు బిగ్ బాస్ వెళ్ళావ్. అందులోకి వెళ్ళింది ఆమె కోసమే కదా, ఐ యామ్ హ్యాపీ" అని చెప్పింది. ఆ తర్వాత పాపతో కేక్ కట్ చేపించి, నీ బ్లెస్సింగ్స్ పాపకి ఎప్పుడు ఉండాలి అని చెప్పి దీవించమంది.
ఆ తర్వాత ఆదిరెడ్డి మాట్లాడుతూ, "హ్యాపీ బర్త్ డే అద్విత. థాంక్స్ బిగ్ బాస్. థాంక్స్ కవిత. ఇది చాలు బిగ్ బాస్. మీకు ఋణపడి ఉంటాను" అని ఆదిరెడ్డి అనగానే హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. హౌస్ మేట్స్ అందరు ఒక్కసారిగా ఆదిరెడ్డి ని హగ్ చేసుకొని హ్యాపీ బర్త్ డే అద్విత అంటు విషెస్ చెప్పారు. ఇది నిన్నటి ఎపిసోడ్‌లో హైలైట్ గా నిలిచింది.