English | Telugu
ఆయన శ్రీధర్ మాష్టర్ కాదు..సాయిసాత్విక్ కి ఘాటు వార్నింగ్
Updated : Jan 6, 2024
ఢీ సెలబ్రిటీ స్పెషల్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో కమెడియన్ ఆది సింగర్ గా, టచ్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చి కాసేపు ఫన్ క్రియేట్ చేసాడు.. హోస్ట్ నందు సింగర్ గా ఒక పాట పాడమనేసరికి ఏదో సాంగ్ పాడి అందరినీ నవ్వించాడు. తర్వాత "ఏరా జెస్సి టచప్ చేయనా" అనేసరికి "ఏరా జెస్సి" ఏంటి అంటూ ఫీలయ్యాడు..దానికి ఆది కౌంటర్ వేసాడు "అక్కా టచప్ చేయనా" అని అడిగేసరికి పడీపడీ నవ్వుకున్నాడు జెస్సి. తర్వాత కొన్ని డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అయ్యాక జడ్జిగా ఉన్న శ్రీధర్ మాష్టర్ కూతురు అక్షద స్టేజి మీదకు వచ్చి వాళ్ళ నాన్న అసలు రూపం బయట పెట్టింది. ఇక ఆది దొరికిందే ఛాన్స్ అని "మీ నాన్న గారి గురించి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్పండి" అనేసరికి "ఒకసారి నాకు ఇంట్లో బాగా బోర్ కొట్టింది.
ఆ టైంలో నేను వేరే నంబర్ నుంచి నాన్నకు కాల్ చేసాను. కొత్త నంబర్ కదా ఎవరో తెలీక ఎవరు అన్నారు. నేను ప్రియా, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని అడిగేసరికి మా నాన్న ఓకే చెప్పేసారు." అని అక్షద చెప్పేసరికి "ఐతే శ్రీధర్ మాష్టర్ కాదు శేఖర్ మాష్టర్ 2 అన్నమాట మీరు " అని ఆది శ్రీధర్ మాష్టర్ పరువు తీసేసాడు. "ఇన్స్టాగ్రామ్ లో ఒక గర్ల్ ఫ్యాన్ తో చాట్ చేస్తుండగా ఆమె నాన్న నంబర్ అడగగానే పంపించేశారు" అని ఇంకా కొన్ని విషయాలు చెప్పేసరికి స్టేజి మీద నుంచి శ్రీధర్ మాష్టర్ వచ్చేసి చెప్పొద్దూ అనేసరికి ఆది అడ్డుపడ్డాడు "ఇంతకు మీ గర్ల్ ఫ్యాన్ పేరేమిటి ఇంతకు" అని ఆది అడిగాడు. దాంతో అందరూ నవ్వేశారు. ఇక ఈ ప్రోమోలో ఫైనల్ గా కార్తీక దీపం చిన్నారి హిమ అలియాస్ సహృద వచ్చి "ఫిదా" మూవీ సాంగ్ కి డాన్స్ చేసింది. ఆమె పెర్ఫార్మెన్స్ కి శ్రీధర్ మాష్టర్ 45 మార్క్స్ ఇచ్చేసరికి సాత్విక్ లేచి "ఆ సాంగ్ కి థీమ్ లేదు..దానికి మీరు 45 మార్క్స్ ఇస్తున్నారా" అనేసరికి "నేను సినిమాల్లో ఉంటాను తెలుసా ..కూర్చో" అంటూ వేలు పెట్టి సాత్విక్ కి వార్నింగ్ ఇచ్చారు జడ్జి శ్రీధర్ మాష్టర్..ఇక ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో ఇక నుంచి హాట్ హాట్ గొడవల కంటెంట్ రాబోతోందన్న విషయం దీన్ని బట్టి తెలుస్తోంది.