English | Telugu

చూస్తోంది వ్యూహం మూవీనా...ఆ వీడియోస్ ఆ...ఆర్జీవిని అడిగిన నెటిజన్


రామ్ గోపాల్ వర్మ "వ్యూహం" మూవీని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి..అసలు చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంటే ఇలాంటి వెదర్ లో వ్యూహం మూవీ గొడవ రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కిస్తోంది. ఐతే ఈ మూవీని జనవరి 11వ తేదీ వరకు రిలీజ్ చేయకూడదని హైకోర్టు స్టే విధించింది. రామ్ గోపాల్ వర్మ తెచ్చుకున్న సెన్సార్ సర్టిఫికెట్ మీద ఈ స్టే విధించింది న్యాయ స్థానం. ఐతే ఈనెల 11 కు బదులు 8 వ తేదీన విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని సినిమా యూనిట్ కోరింది.

ఇది అసలు విషయం... ఐతే ఇప్పుడు తన మూవీ తానే హ్యాపీగా మందేస్తూ డాక్టర్ ప్రదీప్ చింతా అనే వ్యక్తితో కలిసి ఆ మూవీని చూస్తున్న పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఇది చూసిన నెటిజన్స్ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు.." ఎలాగో థియేటర్ లో రిలీజ్ కావడం లేదని నీ మూవీని నువ్వే చూసుకుంటున్నావా బ్రో ...ఇంత దీర్ఘంగా చూస్తున్నారు అంటే పోర్న్ వీడియోస్ అయ్యుండొచ్చు" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జరిగిన పరిణామాలు..ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. వైఎస్ జగన్ ఎలా పాదయాత్ర మొదలుపెట్టి ఏపీ సీఎంగా ఎలా అయ్యాడు వంటి స్టోరీ లైన్ తో వ్యూహం అనే మూవీ తీసాడు ఆర్జీవీ. ఐతే ఇందులో టీడీపీ తమను కించపరిచే విధంగా చూపించే ఉంటారని, రాబోయే ఎన్నికల్లో ఈ మూవీ ప్రభావం ప్రజల మీద ఉంటుందనే ఉద్దేశంతో నారా లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలు ఈ మూవీ మీద కేసు వేశారు.