English | Telugu

నాకు నిద్ర సరిపోవడం లేదు.. బాధపడుతున్న శ్రీముఖి

శ్రీముఖి బుల్లితెర మీద ఎంతో చలాకీగా అల్లరి చేస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య షోస్ మీద షోస్ చేస్తూ ఎటు చూసినా శ్రీముఖినే కనిపిస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్ లో పాపం కనీసం నిద్రపోవడానికి కూడా టైం సరిపోవడం లేదని చాలా బాధపడుతోంది.

'బిగ్ బాస్' సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా వచ్చింది. 'క్రేజీ అంకుల్స్', 'మ్యాస్ట్రో' మూవీస్ లో నటించింది. ఇక ఇప్పుడు 'భోళా శంకర్' సినిమాలో ఓ రోల్ కూడా చేస్తోంది. ఇప్పుడు బుల్లితెర మీద ఖాళీ లేకుండా షోస్ చేస్తోంది. విదేశాల్లో జరిగే ఈవెంట్స్ కి వెళ్తోంది. అక్కడి ఫొటోస్ ని కూడా తన ఫాన్స్ కోసం షేర్ చేస్తూ ఉంటుంది. ఇంత బిజీ శ్రీముఖి ఇప్పుడు పాపం నిద్రకోసం చాలా తపిస్తోంది. దీనికి సంబంధించి ఒక కామెంట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది.

"నాకు 8 గంటల నిద్ర కావాలి అదీ ఎలా ఉండాలంటే స్కూల్ కి వెళ్ళినప్పుడు, జాబ్ కి వెళ్ళినప్పుడు 8 గంటలు ఎంత భారంగా గడుస్తాయో అంత లేట్ గా గడవాలి అనేది నా కోరిక" అంటూ ఎమోజితో పోస్ట్ చేసింది. కానీ అలా జరగదు కదా. ఇలా పాపం శ్రీముఖి నిద్ర కోసం ఎలా తపిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.