English | Telugu
కొంతమందికి నా బ్యాక్ అంటేనే చాలా ఇష్టం!
Updated : Oct 9, 2022
అష్షు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న హాట్ స్టార్. ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ఓ రేంజ్ లో ఫేమస్ ఐపోయింది. బుల్లితెర కామెడీ షోస్ లో పాల్గొంటూ ఫ్యాన్స్ ని బాగానే సంపాదించుకుంది. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం అష్షు స్పెషల్ ఈవెంట్లు, కవర్ సాంగ్స్ అంటూ ఫుల్ బిజీ ఐపోయింది. ఆర్జీవీతో కలిసి తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంది. రూ.8 లక్షలు పెట్టి ఒక నెక్లెస్ కొనుక్కుంది. వాళ్ళ నాన్న మెర్సిడీజ్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు.
ఇక ఇప్పుడు అష్షు ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది తన ఇన్స్టాగ్రామ్ పేజీలో. ఆమె నీలం చీర కట్టుకుని సైడ్ యాంగిల్ లో ఫొటోలకు ఫోజులు ఇచ్చేసి వాటిని షేర్ చేసింది. "కొంతమందికి నా బ్యాక్ అంటేనే చాలా ఇష్టం.. ఎందుకంటే వారిలో కొందరు నా వెనుక మాట్లాడుతూ ఉంటారు" అనే కాప్షన్ కూడా పెట్టింది. ఇక ఈ ఫొటోకు బోల్డు కామెంట్స్ వస్తున్నాయి. ఆరియానా గ్లోరీ మాత్రం 'సెక్సీ' అని కామెంట్ పెట్టి పక్కనే ఫైర్ ఎమోజి పెట్టేసింది.
ఇక అష్షు టైం దొరికితే వెకేషన్ కి వెళ్తూ అక్కడి ఫొటోస్ ని తన ఇన్స్టా పేజీ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఎవరు ఏ కామెంట్ ఐనా పెట్టుకోండి నాకేం సంబంధం లేదు నా పేజీ నా ఇష్టం, నా ఫొటోస్ నా ఇష్టం అంటూ అష్షు తనకు నచ్చిన ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటుంది.