English | Telugu

కుర్ర హీరోలతో బాలయ్య 'అన్ స్టాపబుల్' ఫన్!

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' ​సీజన్-2 సందడి మొదలైంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అక్టోబర్ 14 నుంచి ఓటీటీ వేదిక ఆహాలో అన్ స్టాపబుల్ సీజన్-2 స్ట్రీమింగ్ కానుంది. మొదటి ఎపిసోడ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనబోతుండగా, చివరి ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఈ సీజన్ లో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉన్నాయని టాక్. ఒక ఎపిసోడ్ లో ఇద్దరు కుర్ర హీరోలు సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.

షోకి ఎవరొచ్చినా తనదైన స్టైల్ లో ఎంటర్టైన్ చేయడం బాలయ్యకి అలవాటు. అందుకే మొదటి సీజన్ అంత పెద్ద సక్సెస్ అయింది.. అలాగే ఇప్పుడు రెండో సీజన్ కోసం కూడా ప్రేక్షకులు అంతలా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ లో బాలయ్య ఎంటర్టైన్మెంట్ డోస్ మరింత పెంచబోతున్నాడట. అందుకే కుర్ర హీరోల నుంచి స్టార్స్ వరకు అందరికి కవర్ చేస్తున్నారట. ఒక ఎపిసోడ్ లో కుర్ర హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ ఎపిసోడ్ షూట్ ఈరోజు(ఆదివారం) అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నట్లు సమాచారం. ఈ కుర్ర హీరోలతో కలిసి బాలయ్య కుర్రాడిలా మారిపోయి ఏ రేంజ్ వినోదాన్ని పంచుతాడోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..