English | Telugu
అనసూయకు ధీటుగా శ్రీముఖి కాస్కో అంటోంది!
Updated : Nov 18, 2021
ఓ షోకి పోటీగా మరో షోని అదే టైమ్‌కి లైన్‌లోకి తీసుకురావడం అనే పోటీ ఈ మధ్య మొదలైంది. బిగ్‌బాస్ షోకు ధీటుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఎవరు మీలో కోటీశ్వరులు` టాక్ షోని మొదలు పెట్టడం.. దాని కారణంగా బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్‌లో తేడా రావడం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో జెమినీ టెలివిజన్ షోకి పోటీగా మరో షో తెరపైకి వచ్చేసింది. జెమిని టీవీలో `మాస్టర్ ఛెఫ్` పేరుతో ఛెఫ్‌ల ఛాలెంజింగ్ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.
ఈ షోకు ధీటుగా మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ తన ఆహా ఓటీటీ కోసం `ఛెఫ్ మంత్ర` పేరుతో సరికొత్త షోకి శ్రీకారం చుట్టారు. `మాస్టర్ ఛెఫ్` కు ముందు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించగా టీఆర్పీ రేటింగ్ కారణంగా తమన్నాని తప్పించి నిర్వాహకులు ఆ స్థానంలో హోస్ట్‌గా అనసూయని రంగంలోకి దింపేశారు. ఇక ఇదే స్పీడుతో ఆహా `ఛెఫ్ మంత్ర` షో కోసం బుల్లితెర రాములమ్మ శ్రీముఖిని హోస్ట్‌గా ఫైనల్ చేశారు. దీంతో అనసూయ, శ్రీముఖిల మధ్య నువ్వా నేనా కాస్కో అనే స్థాయిలో పోటీ మొదలైంది.
శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న `ఛెఫ్ మంత్ర` సక్సెస్ అయితే అనసూయ ఇమేజ్ డ్యామేజ్ అయినట్టే అంటున్నాయి సినీ వర్గాలు. ఇప్పటికే రెజీనా, శ్రియలతో ఓ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌ని షూట్ చేసి వదిలారు కూడా. తాజాగా శ్రీముఖి ఈ ప్రోగ్రామ్ కోసం ట్రెండీగా సిద్ధమై ఫొటోలకి ఫోజులిచ్చిది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.