English | Telugu
‘ఊ అంటావా మావ’ అంటూ శేఖర్‌తో చిందేసిన శ్రీముఖి!
Updated : Sep 7, 2022
గ్లామరస్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాంకరింగ్ మాత్రమే కాదు,డాన్స్ కూడా ఇరగదీసేస్తుంది. ఎప్పుడూ యాక్టీవ్ గా, స్టేజిపై సందడి చేస్తూ ఉంటుంది శ్రీముఖి.. బుల్లితెర మీద శ్రీముఖి ఎన్నో షోస్ చేస్తూ అలరిస్తూ ఉంది. ఇప్పుడు "డాన్స్ ఐకాన్" లోకి టీమ్ లీడర్ గా ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగులో అతి పెద్ద డిజిటల్ ప్లాట్ ఫామ్ ఐన ఆహాలో ఈ డాన్స్ షో స్టార్ట్ కాబోతోంది. దీన్ని పాపులర్ యాంకర్ ఓంకార్ నిర్వహిస్తున్నారు.
సెప్టెంబర్ 11న 'డాన్స్ ఐకాన్' ప్రారంభం కానుంది. ఈ షో కోసం శ్రీముఖి స్పెషల్ పెర్ఫార్మెన్స్ నిజంగా అద్భుతః అనొచ్చు. గ్లామరస్ పింక్ డ్రెస్ లో ‘ఊ అంటావా మావ’ పాటకు డ్యాన్సర్స్ తో కలిసి స్టెప్పులు ఇరగదీసేసింది. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి వేసినహాట్ స్టెప్స్ తో ఒక ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
శ్రీముఖి డ్యాన్స్ పై నిర్మాత అల్లు అరవింద్, శేఖర్ మాస్టర్ ప్రశంసలు కురిపించారు."ఈ పాటకు ఒక అమ్మాయి చేస్తేనే మాములుగా ఉండదు, అలాంటిది నలుగురు అమ్మాయిలూ చేసేసరికి అదిరిపోయింది" అని శేఖర్ మాస్టర్ అంటే "మిగతా ప్రొఫెషనల్ డాన్సర్స్ తో సమానంగా చేసావ్ష అంటూ శ్రీముఖిని పొగిడేశారు అల్లు అరవింద్.