English | Telugu
'ఆర్ఆర్ఆర్'లో చరణ్, తారక్.. ఎవరు బాగా చేశారు? జక్కన్నను ఇరుకున పెట్టిన సుమ!
Updated : Sep 7, 2022
సుమ ఎప్పుడూ తన షోకి వచ్చే వాళ్లందరికీ ట్విస్టులు ఇస్తూ ఇరుకున పెడుతూ ఉంటుంది. లేటెస్ట్ గా రిలీజ్ ఐన క్యాష్ ప్రోమో చూస్తే అది అర్థమవుతుంది. రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్` మూవీ ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటన వేరే లెవెల్.
లేటెస్ట్‌గా రాజమౌళి క్యాష్ షోకి వచ్చారు. అందులో రాజమౌళి వెపన్ షాప్ చూపించింది సుమ. ఆ షాపులో రాజమౌళి తన సినిమాల్లో ఇప్పటివరకు వాడిన కత్తుల్ని ప్రదర్శనకు పెట్టింది. ఫైనల్ గా "ఆర్‌ఆర్‌ఆర్ మూవీలోఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరిలో ఎవరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు" అని ప్రశ్నించేసరికి క్యాష్ షోకి వచ్చిన 'బ్రహ్మాస్త్ర' హీరోహీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ షాకయ్యారు. జక్కన్న ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఎవరి పేరు చెప్తే ఎవరు ఫైర్ అవుతారో అన్నట్టుగా సైలెంట్ గా ఉన్నారు. ఇక ప్రోమో అక్కడితో కట్ చేసేసారు.
ఇంతకు జక్కన్న ఏం ఆన్సర్ ఇచ్చారు? అనే విషయం షో చూస్తేనే తెలుస్తుంది. ఇక ఆయన ఎలా స్పందిస్తారనే విషయంపై తారక్ ఫ్యాన్స్, రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. శనివారం ప్రసారం కాబోయే ఫుల్ షోలో రాజమౌళి ఎలా స్పందించారో చూడాలి.