English | Telugu

మొదటి వారం బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యేది వాళ్ళేనా?

బిగ్ బాస్ సీజన్-7 భారీ అంచనాలా మధ్య గ్రాండ్ గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. అయితే హౌస్ లోకి ఇరవై ఒక్క మంది కంటెస్టెంట్ లని పంపిస్తారని అనుకున్నారంతా కానీ హౌస్ లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ని లోపలికి పంపించారు బిగ్ బాస్. మిగతా కంటెస్టెంట్స్ ని ఈ వీక్ లో పంపిస్తారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సీజన్ అంతా ఉల్టా పల్టా అని నాగార్జున చెప్పిన విధంగానే జరుగుతుంది.

హౌస్ లోకి వెళ్లిన పద్నాలుగు మంది తమకి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే అందరూ పూర్తి స్థాయిలో బిగ్ బాస్ ని సంతృప్తి చేయట్లేదనే చెప్పాలి. కొందరు టాస్క్ లు చెయ్యడంలో విఫలం అవుతున్నారు. అయితే సోమవారం రోజు జరిగిన నామినేషన్ లలో ఎక్కువ ఓట్లు పడి నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎనిమిది మంది ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో యాక్టర్ శివాజీ, సింగర్ దామిణి, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, రతికరోజ్, షకీల, టేస్టీ తేజ, కిరణ్ రాథోడ్, అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ఆట సందీప్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ కంటెస్టెంట్స్ గా బిగ్‌బాస్ హౌజ్ లో కొనసాగుతున్నారు‌.

గత బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు ప్రతీ సీజన్ లో తమ ఫేవరెట్ కంటెస్టెంట్ కి పది ఓట్లు వేసుకునే అవకాశం ఉండేది. కానీ ఈ సీజన్ లో ఒకే ఒక ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. గత సీజన్ లో మొదట వారం ఎలిమినేషన్ ఉండేది కాదు కానీ ఈ సారి ఉల్టా పల్టా అంటున్నారు కాబట్టి ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందనే అంటున్నారు. ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే హౌజ్ నుండి ఎవరు బయటకు వెళ్తారంటూ సోషల్ మీడియా లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఎనిమిది మందిలో ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్ మొదట స్థానం లో ఉన్నాడు. చివరగా కిరణ్ రాథోడ్ ఉంది. అయితే చివరి రెండు స్థానాలలో దానిణి, కిరణ్ రాథోడ్ స్వల్ప ఓట్ల తేడాతో ఉంటున్నారు. ఈ వీక్ ఎలిమినేషన్ లేదంటే అందరూ సేఫ్. లేదంటే మాత్రం కిరణ్ రాథోడ్, దామిణి ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది. మరి ఈ ఉల్టా పల్టా సీజన్ సరికొత్తగా సాగుతూ ప్రేక్షకులను ఆసక్తిని రేకెత్తిస్తుంది‌. ఎప్పుడేం జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు.