English | Telugu
కొంప ముంచిన యష్..వసంత్‌కు చిత్ర బ్రేకప్
Updated : May 4, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. ఏడేళ్ల క్రితం వచ్చిన హిందీ సీరియల్ `యే హై మొహబ్బతే` ఆధారంగా ఈ సీరియల్ ని తెలుగులో రీమేక్ చేశారు. నిరంజన్, డెబ్జాని మోడక్, మిన్ను నైనిక ప్రధాన పాత్రల్లో నటించారు. బెంగళూరు పద్మ, ప్రణయ్ హనుమండ్ల, మీనాక్షి, ఆనంద్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది. తల్లి కాలేని ఓ యువతికి తల్లి వదిలేసిన ఓ పాపకు, ఆ పాప కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడే ఓ తండ్రి.. ఇలా ఈ మూడు పాత్రల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సీరియల్ సాగుతోంది.
రౌడీలతో నేను ఫైట్ చేసినందుకు డిజప్పాయింట్ అయ్యావా అని వేదని యష్ అగుడుతాడు. అంతే కాకుండా వాళ్లు నన్ను చితక్కొట్టి వుంటే హ్యాపీగా ఫీలయ్యే దానివా అంటాడు. దాంతో మండిన వేద అవును అంటుంది. కట్ చేస్తే.. వసంత్ కోసం చిత్ర పార్క్ లో ఎదురుచూస్తూ వుంటుంది. ఫోన్ చేసినా అనంద్ ఆన్సర్ చేయకపోవడంతో ఆవేశంతో ఊగిపోతూ వుంటుంది. అయితే యష్ పక్కన వుండటంతో చిత్ర ఫోన్ ని ఆనంద్ అటెండ్ చేయలేకపోతాడు. రెండు గంటల తరువాత ఆనంద్ చిత్ర దగ్గరికి వెళతాడు. అదే సమయంలో ఆనంద్ , చిత్రలని గమనిస్తూ యష్ దూరంగా నిలబడి వుంటాడు.
వసంత్ సారీ అని చెబుతుండగానే కోపంతో రగిలిపోతున్న చిత్ర చెంప పగలగొడుతుంది. అది చూసి యష్ షాకవుతాడు. ఏంటీ పిల్ల ఇలా రెచ్చిపోతోందని ఫైరవుతాడు. వసంత్ లేట్ కావడానికి కారణం అంటూ వివరిస్తుంటే జాబ్ ముఖ్యమైనప్పుడు నీకు లవ్ లవర్ ఎందుక అని చిత్ర నిలదీస్తుంది. నేనంటే ఇష్టం లేని వాడివి నీకు నేను అవసరం లేనప్పుడు నువ్వు నాకు అవసరం లేదంటూ బ్రేకప్ చెబుతుంది. అది తట్టుకోలేని వసంత్ ప్లీజ్ అలా అనొద్దు అంటూ చిత్ర కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన యష్ .. ఐదు నిమిషాలే ఆగలేనిది లైఫ్ అంతా నీతో ఎలా వుంటుంది అంటూ వసంత్ ని అక్కడి నుంచి తీసుకెళతాడు.. ఆ తరువాత ఏం జరిగింది? .. వేద .. యష్ పై ఎందుకు సీరియస్ అయిందన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.