English | Telugu
టార్గెట్ అరియానా.. బుద్ది చూపించిన అఖిల్
Updated : May 3, 2022
రేస్ టు ఫినాలే ముందు జరిగే చివరి నామినేషన్స్ సోమవారం మొదలయ్యాయి. దీని హీట్ మామూలుగా లేదు. ఫైనల్ కి మరో మూడు వారాలే వుండటంతో టాప్ 5 లో నిలిచేది ఎవరు? టైటిల్ విన్నర్ గా కప్పుని సొంతం చేసుకునేది ఎవరన్నది ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వారం నామినేషన్స్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో అఖిల్, అరియానాల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. నిజానికి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చి వెళ్లడంతోనే ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోయింది. అషురెడ్డిని బయట నుంచి సపోర్ట్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్ సైతం బిందు మాధవికి టాప్ ప్లేస్ ఇవ్వడంతో తనే టైటిల్ విన్నర్ అనే సంకేతాలు ఇంటి సభ్యులకు క్లియర్ గా వెళ్లిపోయాయి.
హౌస్ లోకి వచ్చిన అనీల్ అక్క కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే హౌస్ లో వున్న అరియానా కూడా ఈ సారి ఉమెన్ బిగ్ బాస్ విన్నర్ కావాలని గట్టిగా వాదించింది. దీంతో అఖిల్ ఎప్పటిలాగే తన బుద్ధి చూపించేశాడు. ఈసారి తానే విన్నర్ అనే భ్రమల్లో వున్న అఖిల్ నామినేషన్స్ లో ఈ విషయంపై అరియానాని టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా హౌస్ లో ఇద్దరి మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా అరియానా `ఉమెన్ కార్డ్` తీసుకురావడం తనకు నచ్చలేదని మొఖం మీదే చెప్పేశాడు.
అమ్మాయిలు గెలవాలని కోరుకుంటున్నా అని అన్నావ్ అమ్మాయి గెలవాలని అనుకున్న నువ్వు దానికి తగ్గట్టుగా గేమ్ ఎందుకు ఆడలేదు` అని అఖిల్ అరియానాపై మండిపడ్డాడు. దీంతో అరియానా బయట టాక్ అదే వుంది. దాన్నే నేను కోరుకుంటున్నా బిగ్ బాస్ అని చెప్పేసింది. అది రాంగ్ అని అకిల్ అనడంతో `నేను గెలిచినా గెలవకపోయినా ఒక స్ట్రాంగ్ ఉమెన్ బిగ్ బాస్ టైటిల్ గెలవాలి అంటూ గట్టిగా అరిచి చెప్పింది అరియానా. దీంతో అఖిల్ ఎవరు బాగా ఆడితే వాళ్లే టైటిల్ విన్నర్ అవుతారంటూ మళ్లీ ఫైరయ్యాడు.