English | Telugu

Sivaji Bigg Boss Captain: హౌస్ లో కొత్త కెప్టెన్‌గా వాజీ వాజీ శివాజీ... చురకలు అంటించిన నాగార్జున!


‌బిగ్ బాస్ సీజన్-7 ఆధ్యాంతం ఆసక్తిగా మారుతుంది. ప్రతీ వారం టాస్క్ లతో కంటెస్టెంట్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ వారమంతా ఫ్యామిలీ వీక్ కొనసాగింది. ఇక హౌస్ లో కొత్త కెప్టెన్ కోసం ఓ బేబీ బాల్స్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.

నిన్న జరిగిన ఈ టాస్క్ లో గౌతమ్-శివాజీల‌ మధ్య పెద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ టాస్క్ లో అంబటి అర్జున్, శివాజీ ఇద్దరు మిగిలారు. వీరిలో కెప్టెన్ ఎవరని చెప్పకుండా ఆ సస్పెన్స్ ని అలానే ఉంచేశాడు బిగ్ బాస్. ఇక శనివారం నాటి ప్రోమోలో ఎవరు కెప్టెనో తెలుస్తుందని బిగ్ బాస్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇక నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ ని ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి.. ఈ ఇద్దరిలో కెప్టెన్ ఎవరని మీరు అనుకుంటున్నారని అడిగాడు. శోభాశెట్టి, ప్రశాంత్, ప్రియాంక, యావర్, అశ్వినిశ్రీ దాదాపు అందరు శివాజీ పేరే కెప్టెన్ గా చెప్పారు.

"జనం మెచ్చినోడే నాయకుడని నాకు అనిపించింది సర్. అది శివాజీ‌ గారే" అని అమర్ దీప్ అన్నాడు. ఇక రాజమాతలుగా శోభాశెట్టి, ప్రియాంక చేసిన అన్ ఫెయర్ నామినేషన్ గురించి గట్టిగా అడిగాడు నాగార్జున. మీరిద్దరు కలిసి అమర్ దీప్ ని సేవ్ చేశారంటు చురకలంటించాడు. ప్రియాంక, శోభాశెట్టి ఇద్దరు చాలా డామినేట్ చేసారని అశ్వినిశ్రీ అనగానే.. శోభాని పిలిచి డామినేట్ చేస్తున్నారంట అని అడిగేసరికి‌‌.. శోభాశెట్టి తడబడింది. దీంతో ఈ వీకెండ్ సీరియల్ బ్యాచ్ కి మరోసారీ వార్నింగ్ వచ్చేలా ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే శివాజీ హౌస్ కి కొత్త కెప్టెన్ అయినట్టు వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.