English | Telugu

చక్రి, మహాలని పట్టుకున్న భూషణ్.. జస్ట్ మిస్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -25 లో.....భూషణ్ తన ఫ్రెండ్ ని రమ్మని తన కార్ లో వెళ్ళిపోతాడు. మంచిపని చేసాడు లేదంటే మహా గురించి తప్పుగా మాట్లాడతాడా అని ఆదితో ప్రతాప్ అంటాడు. అతనికి ఇంకా మహాని పెళ్లి చేసుకోవాలని ఉందని ఆది అంటాడు. మరొకవైపు మహాని చక్రి తీసుకొని వెళ్తుంటే ఒక దగ్గర కార్ ఆగుతుంది.

చక్రి కార్ దిగబోతుంటే ఇక్కడ ఎందుకు అపావు. నాకు భయంగా ఉంది. కావాలనే అపావు కదా అని మహా అంటుంది. లేదండి ఇంజన్ హీట్ అయిందని చక్రి చెప్తాడు. చక్రి బయట వైపు వెళ్లి మహాని తీసుకొని వెళ్తాడు. మహాకి భయం వేసి ఒక పెద్ద రాయి పట్టుకుంటుంది. చక్రి తన కోసం చలిమంట పెడతాడు. దాంతో అతన్ని తప్పుగా అర్ధం చేసుకున్నానని మహా రాయి పక్కకి విసిరేస్తుంది. అ తర్వాత తనకి ఆకలిగా ఉందని మొక్కజొన్న కాల్చి ఇస్తాడు చక్రి. మహాకి నిద్ర వచ్చి తన భుజాలపై తల వాలుస్తుంది మహా. దాంతో చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనని పక్కన పడుకోపెట్టి దుప్పటి కప్పి తనని రాత్రంతా అలా చూస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం మహా నిద్రలేచి కార్ దగ్గరికి వెళ్తుంది‌. ఆతర్వాత చక్రి, మహాని తీసుకొని సిటీకి బయల్దేరతాడు.

అప్పుడే భూషణ్ వాళ్ళ కార్ చక్రి కార్ కి ఎదురుగా వచ్చి ఆగుతుంది. భూషణ్ కార్ దిగి.. మహా నా కార్ ఎక్కు అని తనపై కోప్పడుతాడు. నేను ఎక్కను మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోకుంటే మీ కార్ అద్దాలు పగులగొడతానని మహా అనగానే భూషణ్ వాళ్ళ ఫ్రెండ్ భయపడి భూషణ్ ని అక్కడ నుండి తీసుకొని వెళ్తాడు. ఇక చక్రి, మహా ఇద్దరు వెళ్తున్న కార్ ని భూషణ్, తన ఫ్రెండ్ తో కలిసి ఫాలో చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.