English | Telugu

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

అ తర్వాత పారుకి హెల్ప్ చేసిన అకాడమీ మేనేజర్ కి ఇండైరెక్ట్ గా గంగ కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత పారు ఇంకా తన ఫ్రెండ్స్ అందరు గంగ తాగాల్సింది మేమ్ ఎలా తాగామని అనుకుంటారు. ఈసారి ప్లాన్ చేస్తే పర్ ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటారు. మరొకవైపు శకుంతల దగ్గరికి ఇషిక, వీరు వచ్చి మీ మాట ఇంట్లో ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ రోజు గంగ, రుద్ర పూజ చెయ్యాలి. గంగ లేదని అన్నయ్య పూజ క్యాన్సిల్ చేసాడు. అన్నయ్య నీ గురించి చాలా ఆలోచిస్తాడు కానీ రుద్ర బావ ఇలా ఆలోచిస్తే బాగుండు అని శకుంతలతో ఇషిక చెప్తుంది. గంగ వస్తుంది. పూజ జరుగుతుందని శకుంతల అంటుంది. మరొకవైపు క్యాంటీన్ లో గంగ ప్లేట్ లో అన్నం తీసుకొని వెళ్తుంటే పారు, ఇంకా తన ఫ్రెండ్స్ గంగ కిందపడేలా చేస్తారు. గంగని అవమానిస్తారు అయ్యో అన్నం లేదని పారు అంటుంటే.. మేం ఉన్న దాంట్లో సర్దుకుంటామని గంగ ఫ్రెండ్స్ గంగకి భోజనం షేర్ చేస్తారు.

మరొకవైపు ఇప్పుడు పూజ చెయ్యాలి. పౌర్ణమి గడియ్యాలో అమ్మవారి పూజ జరగాలి. నువ్వు గంగ పూజలో కూర్చోవాలని శకుంతల తన నిర్ణయం చెప్తుంది. గంగని తీసుకొని వస్తానని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత పారుకి ఇషిక ఫోన్ చేస్తుంది. అకాడమీలో జరిగింది మొత్తం పారు చెప్తుంది. గంగని తీసుకొని రావడానికి రుద్ర బావ అక్కడికి వచ్చాడని పారుకి ఇషిక, వీరు చెప్తారు. బావ ఎలాగైనా గంగని తీసుకొని వస్తాడు. దాంతో అక్కడ గంగ లేదని మేడమ్ కి చెప్పి సస్పెండ్ చేపించమని వీరు చెప్తాడు. గంగని తీసుకొని రుద్ర బావ రాకుంటే అత్తయ్య గంగని ఎప్పటికి రానివ్వదని వీరు అంటాడు. ఆ తర్వాత రుద్ర అకాడమీ దగ్గరికి వెళ్లి గంగకి పేపర్ లో జరిగింది మొత్తం రాస్తాడు. ఇప్పుడు నేను వెళ్ళాలని గంగ తన ఫ్రెండ్స్ కి చెప్పగానే తన ఫ్రెండ్స్ అందరు గంగకి హెల్ప్ చేస్తారు. దాంతో గంగ గోడదూకి వెళ్తుంది. ఆ తర్వాత గంగని తీసుకొని రుద్ర వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.